ఓ యువకుడు.. డ్యూటీలో ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్ తో ఏదో మాట్లాడాలన్నట్లు దగ్గరకు పిలిచాడు. ఇక అతడు చూస్తుండగానే ఆ యువకుడు పోలీసుకు ముద్దు పెట్టాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వీడయో కాస్త వైలర్ అయింది.
సమాజంలో అప్పుడప్పుడు చిత్ర చిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటాయి. ఇటీవల బీహార్ లో ఓ యువకుడు నడి రోడ్డుపై ఓ వివాహితకు ముద్దు పెట్టుకున్నాడు. ఇదే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే.. రాత్రి పూట ఓ చోట బరాత్ జరుగుతుంది. ఇక్కడికి ఓ పోలీస్ ఆఫీసర్ బందోబస్తు నిమిత్తం వచ్చాడు. అయితే ఈ బరాత్ లో చాలా మంది యువకులు ఎంతో ఉత్సాహంగా డాన్స్ లు చేస్తున్నారు. అందులో ఉన్న ఓ యువకుడు.. డ్యూటీలో ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్ తో ఏదో మాట్లాడాలన్నట్లు దగ్గరకు పిలిచాడు.
ఇదే సమయంలో ఆ యువకుడు అందరూ చూస్తుండగా పోలీసుకు ముద్దు పెట్టాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే కోపంతో ఆ పోలీస్ ఆ యువకుడిపై కళ్లు ఎర్రజేసి ఆ యువకుడిపై దాడి చేసే ప్రయత్నం చేశాడు. వెంటనే గమనించిన స్థానికులు పోలీసును సముదాయించారు. ఇదంతా స్థానికులు సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు. ఇక అదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే ది మాత్రం తెలియరాలేదు. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఒక్కోరు ఒకలా కామెంట్స్ చేస్తున్నారు. పోలీస్ ఆఫీసర్ కు ముద్దు పెట్టిన యువకుడి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.