చాలామంది ప్రతి చిన్న విషయానికి అసహనానికి గురై.. విచక్షణ కోల్పోతున్నారు. ఆ క్షణంలో ఎదుటివారిపై దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల కొన్ని సందర్భాల్లో పోలీసులపై మహిళలు దాడులు చేస్తున్న సంఘటనలు ఎన్నో వెలుగు చూశాయి.
ఈ మధ్యకాలంలో చాలామంది ప్రతి చిన్న విషయానికి అసహనానికి గురై.. విచక్షణ కోల్పోతున్నారు. ఆ క్షణంలో ఎదుటివారిపై దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల కొన్ని సందర్భాల్లో పోలీసులపై మహిళలు దాడులు చేస్తున్న సంఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. తాజాగా ఓ మహిళ డ్యూటీలో ఉన్న పోలీసు ఆఫీసర్‌పై చేయి చేసుకుంది. దీంతో ఆ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. నెటిజన్లు పోలీసులపై దాడికి పాల్పడడం ఖండిస్తున్నారు. అసలు వివరాల్లోకి వెళితే..
ఓ మహిళ పోలీసు పట్ల దురుసుగా ప్రవర్తించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఉన్న ప్రకారం.. డ్యూటీలో ఉన్న ఓ పోలీస్ పై మహిళ తీవ్ర వాగ్వాదానికి దిగింది. ఆ మహిళ తన ముందు నిలబడి ఉన్న కానిస్టేబుల్‌ను చెంపదెబ్బ కొట్టింది. అంతేకాదు.. పోలీస్‌తోపాటు మరో వ్యక్తి ఆమెను వారిస్తున్నప్పటికీ.. బులావ్ ట్రాఫిక్ వాలేకో అంటూ అతన్ని బెదిరించడం లాంటిది చేస్తుంది. ఈ వీడియో పై ఢిల్లీ పోలీసులు స్పందించలేదు.. ‘ఘర్ కా కాలేష్’ అనే ట్విట్టర్ లో ఈ వీడియో షేర్ చేశారు. ఈ సంఘటన వెనుక కారణం అసలు కారణం తెలియాల్సి ఉంది.
Kalesh b/w A Woman and on-Duty Police officer on Roadpic.twitter.com/lMIaX3eSk6
— Ghar Ke Kalesh (@gharkekalesh) August 8, 2023