నేటికాలంలో ప్రతి చిన్న విషయానికి యువకులు చేసే హడావుడి మాములుగా ఉండదు. ఇక స్నేహితుడి పుట్టిన రోజు అంటే రచ్చ రచ్చ చేస్తారు. ఇటీవల కాలంలో ఇలాంటి వేడుకల్లో యువకులు చేసే పనులు శృతిమించి పోతున్నాయి. తాజాగా ఓ యువకుడి పుట్టిన రోజు సందర్భాంగా అతడి స్నేహితుల పిచ్చి పరాకాష్ఠంకి చేరింది. బర్త్ డే బాయ్ పై అమానుషంగా ప్రవర్తించారు. వారిని ప్రశ్నించిన ఓ యువకుడిపై దాడికి దిగారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చదువుకునే సమయంలో స్నేహితుడి బర్త్ డే ఎంతో గ్రాండ్ గా, ఎంతో చిల్ గా, బర్త్ డే బంప్స్ తో హంగామా చేస్తారు. వీడియోలో చూస్తే కాలేజిలో చదువుతున్న ఓ యువకుడి రోడ్డుపై పడేసి అతడి మిత్రులు చీపురుతో కొడుతున్నారు. బురద, పెండ కలిపి పూసినట్లే రంగులు పూస్తున్నారు. దెయ్యం వదిలించేలా చీపురుతో కోడుతున్నారు. ఇందంతా చూసే వాళ్లకు అయ్యయ్య.. ఒక్కడినే చేసి అలా కొడుతున్నారేంటి అని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇది ఆ కొట్టించుకునే పిల్లగాడి పుట్టిన రోజు అంటా.. అందుకే ఈ రచ్చ అంటా.అయితే అది చూసిన ఓ యువకుడు వారిని అడ్డుకున్నాడు. దీంతో పార్డీ మూడ్ లో ఉన్నవాళ్లు .. అతడిపై దాడికి దిగారు. కొంత సమయానికి ఆ యువకుడి కొందరితో వచ్చి వారిపై ప్రతిదాడి చేశాడు. కొంత సమయం పాటు అక్కడ భయానక వాతావరణం నెలకొంది. వీరు చదువుకుంటున్నారా? లేదా గాడిదలు కాస్తున్నారా? అంటూ ఈ వీడియో చూసి నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.