Viral Video: ‘ఇందుకలడందులేడని సందేహము వలదు ఎందెందు వెతికినా అందందు కలడు’ అన్నట్లు.. పాములు దాక్కోని చోటంటూ లేకుండా పోతోంది. గ్యాస్ సిలిండర్ కింద ఉండే ఖాళీ స్థలంలో.. స్కూటర్ సీటు కింద, కారు బోనెట్.. టాయిలెట్ కమోడ్ ఇలా ఎక్కడ పడితే అక్కడ దర్శనిమిస్తున్నాయి. తాజాగా, ఓ బూటులో నాగుపాము కనిపించింది. బూటులో దాక్కుందంటే చిన్న పాము అనుకునేరు.. అది ఓ మోస్తరు పెద్ద పామే. బూటులోంచి పడగ విప్పి బుసలు కూడా కొట్టింది. ఇంతకీ సంగతేంటంటే.. ఉత్తర భారత దేశంలోని ఓ ఇంట్లోకి నాగుపాము ప్రవేశించింది.
వానా కాలం కావటంతో నాగుపాము కొంత వెచ్చదనాన్ని కోరుకున్నట్లు ఉంది. నేరుగా ఇంటి ముందు ఉన్న చెప్పుల స్డాండులోని బూటులోకి దూరింది. ఆ ఇంటి వాళ్లు షూలో పాము ఉన్నట్లు గుర్తించారు. వెంటనే స్నేక్ రెస్క్యూ టీంకు సమాచారం అందించారు. స్నేక్ రెస్క్యూ టీంనుంచి ఓ మహిళ అక్కడికి వచ్చింది. బూటులో కర్ర పెట్టి గెలకగానే.. నాగుపాము బుసలు కొడుతూ.. పడగ విప్పి పైకి లేచింది.
కోపంగా ఆమె వైపే చూడసాగింది. ఆమెపై దాడి చేయటానికి కూడా ప్రయత్నించింది. ఇక ఆ మహిళ పామును స్నేక్ క్యాచింగ్ రాడ్డుతో బూటులోంచి బయటకు తీసింది. తర్వాత అక్కడినుంచి తీసుకెళ్లిపోయి అడవిలో వదిలేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
You will find them at oddest possible places in https://t.co/2dzONDgCTj careful. Take help of trained personnel.
WA fwd. pic.twitter.com/AnV9tCZoKS— Susanta Nanda IFS (@susantananda3) July 11, 2022
ఇవి కూడా చదవండి : వీడియో: ఒక్క ఆటోలో 27 మంది ప్రయాణికులు! పోలీసులే బిత్తరపోయారు!