పవన్ కల్యాణ్ వారాహి యాత్ర సందర్భంగా ఓ యువతి భావోద్వేగానికి గురైంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ యువతికి పిచ్చ క్రేజ్ వచ్చింది.
సినిమా హీరోలకు ఫ్యాన్స్ ఉండటం సాధారణం. కానీ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు మాత్రం భక్తులు ఉంటారు. ఆయనకు తమ గుండెల్లో గుడి కట్టి పూజిస్తూ ఉంటారు. ఆయన కోసం ఎంతటి దూరమైనా వస్తారు.. ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశం నలుమూలలా పవన్ కల్యాణ్‌కు ఫ్యాన్స్ ఉన్నారు. వారికి పవనే దైవం.. ఆయన్ని దగ్గరినుంచి చూస్తే చాలు అనుకునే వారు కొన్ని లక్షల మంది ఉంటారు. అదృష్టం కొద్దీ ఆయనే వారి దగ్గరికి వెళితే.. దేవుడే తమ దగ్గరికి వచ్చినంత సంతోషంగా ఫీలవుతారు. తాజాగా, పవన్‌పై ఉన్న భక్తి ఓ యువతికి సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చిపెట్టింది.
ప్రస్తుతం ఆ యువతి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ సంగతేంటంటే… పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఏపీలోని కాకినాడ జిల్లాలో వారాహి యాత్ర చేపడుతున్నారు. తన ప్రచార వాహనంపై ఊరూరూ తిరుగుతున్నారు. ఆయన్ని చూడ్డానికి అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొన్న ఓ లేడీ ఫ్యాన్ పవన్ కోసం వచ్చింది. ఆయన దూరంగా వారాహిపై ఉంటే చూసి ఎంతో సంతోషించింది. ఓ దేవుడ్ని దగ్గరగా చూసినట్లు ఆమె ఫీలయింది. చేతులెత్తి దండం పెడుతూ.. ఏడుస్తూ ఎంతో భావోద్వేగానికి గురైంది.
ఓ నిమిషానికిపైగా ఈ అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి దీన్నంతా వీడియో తీశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. పవన్ ఫ్యాన్స్ ఆ యువతి వీడియోను సోషల్ మీడియా షేర్ చేస్తున్నారు. స్టాటస్లుగా కూడా పెట్టుకుంటున్నారు. దీంతో ఆ యువతి ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. హీరో కారణంగా ఫ్యాన్‌కు క్రేజ్ రావటం బహుశా చరిత్రలో ఇదే మొదటిసారి అయిఉండొచ్చు. మరి, సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న పవన్ లేడీ ఫ్యాన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.