హనుమాన్ చాలీసా అంటే రామభక్త ఆంజనేయుడుని స్తుతిస్తూ రాసిన 40 చతుర్భుజాలు. ఆర్థిక సమస్యలు, ఇంటి సమస్యలు తొలగడానికి హనుమాన్ చాలీసా చదవాలని హిందువుల నమ్మకం. దీనిని గోస్వామి తులసీదాస్ అక్బర్ నిర్బంధించిన జైలులో రాసారట. ఇప్పుడు అభినవ రామదాసుడిగా ఒడిశా గంజాం జిల్లాకు చెందిన ఓ శిల్పి అద్భుత కళాఖండాన్ని రూపొందించాడు. చెక్కతో ‘హనుమాన్ చాలీసా’ పుస్తకాన్ని తయారు చేసి అందరినీ అబ్బురపరిచాడు. ప్రధాని మోదీకి, ఒడిశా ముఖ్యమంత్రికి ఈ కళారూపాన్ని బహుమతిగా ఇవ్వాలని ఆశిస్తున్నాడు. పుస్తకాల్లో రామకోటి, సాయికోటి పేరుతో దేవుడి నామాలు రాస్తు ఆపార భక్తిని చాటుకుంటారు కొందరు. ఇదే విధంగా ఓ శిల్పి తన భక్తిని భిన్నంగా చాటుకున్నాడు. తన ప్రతిభకు పదునుపెట్టి.. హనుమాన్ చాలీసాను పుస్తకంగా చెక్కాడు.
చెక్కపై ప్రతి అక్షరానికి ఆయువు పోశాడు. ఆయనే ఒడిశా గంజాం జిల్లాకు చెందిన శిల్పి అరుణ్ సాహు. చెక్క, ఉలి, బ్లేడు సాయంతో ఐదు పేజీలుగా హనుమాన్ చాలీసా తయారు చేశాను. రెండు కవర్ పేజీలు అమర్చి వాటిపై హనుమంతుడి బొమ్మను చెక్కాను. ఈ చెక్క పుస్తకం పొడవు 10.5 అంగుళాలు. వెడల్పు 9 అంగుళాలు. ప్రతి పేజీ 2.5 అంగుళాల మందం ఉంటుంది. లాక్‌డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఈ పుస్తకాన్ని తయారు చేశానని వివరించాడు.
అరుణ్ తయారు చేసిన ఈ పుస్తకంపై కుటుంబ సభ్యులు, ఆయన మిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ అరుణ్ అద్భుత కళాఖండాలకు రూపమిచ్చాడని చెబుతున్నారు. తాజ్మహల్, ఈఫిల్ టవర్, ఒడిశా అసెంబ్లీతో పాటు ఇతర కళాకృతులను చెక్కతో తయారు చేశాడని ప్రశంసించారు. అంగుళాలు. లాక్‌డౌన్ సమయంలో ఈ కళాఖండాలు తయారు చేసినట్టు అరుణ్ తెలిపాడు.