మన దేశంలో పెళ్లి వేడుకలు జరిగినట్లు మరే దేశంలోనూ జరగవు. లగ్న పత్రిక రాసుకోవడంతో మొదలయ్యే వేడుకలు.. పెళ్లి తంతు ముగిసే వరకు కొనసాగుతాయి. కుటుంబ సభ్యులు, బంధువుల హడావుడి మామూలుగా ఉండదు. బంధువులు, స్నేహితుల రాకతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారిపోతుంది. మెహందీ ఫంక్షన్, ఫ్రీ వెడ్డింగ్ పార్టీలతో సందడి నెలకొంటుంది. తమ పిల్లల పెళ్లి వేడుకల్లో తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషంగా గడుపుతారు. ఆడుతూ, పాడుతూ సరదగా గడుపుతుంటారు. అటువంటి వీడియోనే ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
కుమార్తె పెళ్లి జరుగుతుందన్న ఆనందంలో ఉన్న తల్లి.. తనను తాను కట్టడి చేసుకోలేకపోయారు. పెళ్లి సందర్భంగా ఏర్పాటు చేసిన మెహందీ వేడుకల్లో చిందులేశారు. ‘ఉడెన్ జబ్ జబ్ జుల్ఫెన్ తేరీ’సాంగ్ ఎంతో ఉత్సాహంగా డాన్స్ వేశారు. ఆమెతో పాటు పెళ్లి కుమార్తె కూడా డాన్స్ చేసి అక్కడ వారిలో ఉత్సాహం నింపారు. ఈ వీడియో పెళ్లి కుమార్తె సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. మీరు ఆ వీడియోపై ఓ లుక్కేసి ఎలా ఉందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) January 26, 2023