మొసళ్లు సాధారణంగా నీళ్లలో ఉంటాయి. నీటిలో ఉన్నపుడు వాటి బలానికి ఏనుగు కూడా అల్లాడిపోతుంది. అదే నేలపైకి వస్తే కుక్క కూడా వాటిని ఇబ్బందిపెడుతుంది. అయితే, నేలపై ఉన్నా.. నీటిలో ఉన్నా వాటి నోటి బలంలో తేడా ఉండదు. ఒక్కసారి నోటికి చిక్కితే..
నీటిలో నివసించే జంతువుల్లో మొసళ్లు అత్యంత ప్రమాదకరమైన జీవులు. ఇవి తమ ఆహారాన్ని వేటాడి అతి కిరాతంగా తింటాయి. నీటిలో ఉన్నపుడు వీటి నోటికి చిక్కితే బయటపడటం చాలా కష్టం. వీటి నోటికి దొరికిన వెంటనే ఆహారాన్ని గింగిరాలు తిరుగుతూ ముక్కలు చేస్తాయి. తర్వాత మింగేస్తాయి. మొసళ్ల బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య ప్రతి ఏటా వేల సంఖ్యలో ఉంటోంది. సాధారణంగా మొసళ్లు నీటిలో నివసిస్తూ ఉంటాయి. ఎంతో అవసరం అయితే తప్ప నీటిని విడిచి చాలా దూరం రావు. తాజాగా, ఓ మొసలి రోడ్డుపైకి వచ్చి కలకలం రేపింది. బిజీగా ఉండే ఆ రోడ్డులో కదలకుండా ఉండిపోయిన అది.. వాహనదారులను బెంబేలెత్తించింది. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక, కోలార్‌లోని ఓ మెయిన్ రోడ్డుపై మార్చిన 3న ఓ మొసలి కనిపించింది.
ఆ రోడ్డుపై వెళుతున్న వాహనదారలు దాన్ని చూశారు. అదలా రోడ్డుపై కనిపించే సరికి బెంబేలెత్తిపోయారు. అది చనిపోయిందా? లేక బతికే ఉందా అన్నది వారికి అర్థం కాలేదు. దూరం నుంచే దాన్ని చూడసాగారు. కొద్దిసేపటి తర్వాత ఫారెస్ట్ అధికారులకు సమాచారం వెళ్లింది. సమాచారం అందుకున్న వారు వెంటనే అక్కడకు వచ్చారు. దాని కాళ్లు, చేతులకు తాళ్లు ఉండటం గమనించారు. ఎవరో దాన్ని పట్టి బయటకు విడిచి ఉంటారని భావించారు. తర్వాత మొసలిని పట్టుకున్నారు. దాన్ని దగ్గరలోని కృష్ణా నదిలో విడిచిపెట్టారు. రోడ్డుపై మొసలి కనిపించిన దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.