ఆస్ట్రేలియాకు చెందిన అత్యంత ఎక్కువ వయసున్న ఓ పెద్దాయన తానింతకాలం జీవించడానికి గల రహస్యాన్ని బట్టబయలు చేశాడు. అదేంటంటే అంటూ చల్లగా చెప్పాడంట. పదవీ విరమణ చేసిన పశువుల పెంపకందారుడు అయిన డెక్స్టర్ క్రుగర్ సోమవారం నాటికి 111 ఏండ్ల వయసు దాటి 124 రోజులను పూర్తిచేసుకున్నాడు. మొదటి ప్రపంచ యుద్ధ అనుభవజ్ఞుడు జాక్ లాకెట్ 2002 లో మరణించినప్పుడు ఇతడి కంటే ఒక రోజు పెద్దవాడు.ఆస్ట్రేలియాకు చెందిన అత్యంత ఎక్కువ వయసున్న ఓ పెద్దాయన.. తానింతకాలం జీవించడానికి గల రహస్యాన్ని బట్టబయలు చేశాడు.
అదేంటంటే – కోడి మెదళ్లు తినడమే అంటూ చల్లగా చెప్పాడంట. పదవీ విరమణ చేసిన పశువుల పెంపకందారుడు అయిన డెక్స్టర్ క్రుగర్ సోమవారం నాటికి 111 ఏండ్ల వయసు దాటి 124 రోజులను పూర్తిచేసుకున్నాడు. మొదటి ప్రపంచ యుద్ధ అనుభవజ్ఞుడు జాక్ లాకెట్ 2002 లో మరణించినప్పుడు ఇతడి కంటే ఒక రోజు పెద్దవాడు. తన ఆత్మకథ రాస్తున్న డెక్స్టర్ క్రుగర్ జ్ఞాపకశక్తి అద్భుతమైనదని నర్సింగ్ హోమ్ మేనేజర్ మెలానియా కాల్వెర్ట్ చెప్పారు. క్రుగర్ ఆస్ట్రేలియాలో అత్యంత వయసున్న వ్యక్తిగా ఉన్నారని ది ఆస్ట్రేలియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వ్యవస్థాపకుడు జాన్ టేలర్ ధ్రువీకరించారు.