ప్రస్తుతం మానవుడు టెక్నాలజీ రంగంలో ఎన్నో విప్లవాత్మక విజయాలు సాధించాడు. ఎప్పటికప్పుడు తన అవసరాల కోసం ఎన్నో కొత్త పరికరాలు సృష్టిస్తున్నాడు. భారత దేశంలో ఎంతో మంది యువత పెద్దగా చదువు లేకున్నా తమకు ఉన్న పరిజ్ఞానంతో అవసరాల కోసం కొత్త కొత్త పరికరాలు తయారు చేస్తున్నారు.
ప్రపంచంలో టెక్నాలజీ విప్లవం అభివృద్ధి చెందిన కొద్ది మనిషి ఎన్నో నూతన ఆవిష్కరణలు చేపడుతున్నారు. ఒక్క మనిషి ప్రాణం సృష్టించడం తప్ప అన్నీ విషయాల్లో తనదైన సత్తా చాటుతున్నాడు. వైద్య, విజ్ఞాన రంగంలో ఎప్పటికప్పుడు వినూత్న ప్రయోగాలు చేస్తూ విజయం సాధిస్తున్నాడు. మనిషి తల్చుకుంటే ఏదైనా సాధించగలడు అని ఎంతో మంది నిరూపించారు. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద పెద్ద చదువులు లేకున్నా తమకు ఉన్న టాలెంట్ తో కొత్త కొత్త పరికరాలు సృష్టిస్తున్నారు నేటి యువత. మంచం తో తయారు చేసిన ఓ వెహికిల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
దేశంలో ఎంతోమంది తమ టాలెంట్ తో వినూత్నమైన పరికరాలు తయారు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విషయం తెలిసిందే. మట్టి కుండతో ఎయిర్ కూలర్, సైకిల్ ని బైక్ గా మార్చడం, తక్కు పెట్టుబడితో ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేయడం ఇలా ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తుంటారు.. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో చూస్తున్నాం. సాధారణంగా మంచం చూడగానే ఎవరికైనా కాస్త సేదతీరాలనిపిస్తుంది. కానీ ఓ యువకుడికి మాత్రం ఆ మంచం వాహనంగా చేసుకుంటే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా ఇంట్లో నిరుపయోగంగా ఉన్న పాత వెహికిల్ కి సంబంధించిన నాలుగు టైర్లు, మోటర్ సిద్దం చేసుకొని ఆ మంచానికి అమర్చాడు. మొత్తానికి మంచం ఓ కదిలే వాహనంగా మార్చేశాడు.
ఇటీవల పెట్రోల్, డీజిల్ ఖర్చు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రయాణ ఖర్చులు కూడా పెరిగిపోయాయి. దీంతో కొంతమంది యువకులు తమకు ఉన్న పరిజ్ఞానంతో విచిత్రమైన వాహనాలు తయారు చేస్తూ తమ అవసరాలకు వాడుకుంటున్నారు. దైనందిన జీవితాన్ని సులభతరం చేసుకునే ప్రక్రియలో ఇలాంటి వాహనాలు వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో కదిలే మంచం వెహికిల్ పై కూర్చుని ఆ ఇద్దరు యువకులు స్థానికంగా ఉన్న పెట్రోల్ పంప్‌కు వచ్చి పెట్రోల్ కొట్టించుకున్నారు. ఓ యువకుడు మంచం వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నట్టుగా కనిపించింది. ఇక మంచం వాహనం చూసిన స్థానికులు ఔరా అంటూ ఆశ్చర్యపోయారు. పెట్రోల్ పోయించి రోడ్డు పై రయ్ రయ్ అంటూ దూసుకు వెళ్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. కాకపోతే ఇది ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారో వివరాలు తెలియరాలేదు.