సంసార జీవితంలో ప్రతిదీ సవాలే. అందులో పిల్లలను పెంచడం అతి పెద్ద సవాళ్లు. వారు పెద్దయ్యే వరకు ఆ తల్లిదండ్రులకు కంటి మీద కునుకు ఉండదు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల కళ్లుగప్పి పిల్లలు ప్రమాదకరమైన ప్రాంతాలకు వెళ్లి చిక్కుల్లో పడతారు. కొన్ని సార్లు ఏదో విధంగా ప్రమాదం నుంచి పిల్లలు బయటపడతారు. మరి కొన్ని సమయాల్లో పిల్లలు చివరకి ప్రాణాలు కోల్పోతారు. తాజాగా ఓ పాప రైల్వే స్టేషన్ లో ఆడుకుంటూ గ్రిల్స్ పట్టుకుని 25 మీటర్ల ఎత్తుకు వెళ్లింది. ఆ పాప చేసిన పని అందర్నీ కలవరపెట్టింది. అక్కడే ఉన్న జవాన్ తన ప్రాణాలను అడ్డుపెట్టి ఆ పాపను కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని నిర్మాణ్ విహార్ మెట్రో స్టేషన్ ఆదివారం(ఫిబ్రవరి 27) సాయంత్రం ప్రయాణికులతో రద్దీగా ఉంది. అంత రద్దీలో కూడా ఎక్కడో ఓ చోట నుంచి పాప ఏడుపులు వినిపిస్తున్నాయి. తీరా చూస్తే ఓ చిన్నారి గ్రిల్ తో ఆడుకుంటూ 25 అడుగుల పైకి ఎక్కేసింది. దీంతో అందరు ఒక్కసారిగా షాకయ్యారు. ఆ పాప అక్కడి నుంచి కింద రాలేక ఏడుస్తుంది. భయంతో ఏమాత్రం పట్టు జారితే పాప ప్రాణాలకే ప్రమాదం. దీంతో అందరు పాపకు అనేక సలహాలు ఇస్తున్నారు. కానీ వారు మాటలతో ఆ పాపలో భయం పెరిగింది. ఇంతలో అక్కడే ఉన్న ఓ జవాన్ రంగంలోకి దిగిపోయాడు.
మెట్రో స్టేషన్ గ్రిల్స్ పట్టుకుని ఆ పాప సమీపంలోకి వెళ్లిన ఆ జవాన్.. సమీపంలోకి వెళ్లిన తర్వాత ఆ పాపకు కొన్ని సూచనలు చేశాడు. అలా జవాన్ ఒక్కో అడుగూ వేస్తూ… మెల్ల మెల్లగా చిన్నారిని కిందకు తీసుకొచ్చాడు. చివర్లో మిగతా వారు పాపను అందుకొని సేవ్ చేశారు. పాపకు ఏ హానీ జరగకుండా కాపాడటంతో అందరు ఆ జవాన్ ను మెచ్చుకున్నారు. అతన్ని రియల్ హీరో అని ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
सी आई एस एफ का नायक!
On 27.02.22 a kid got stuck in grills while playing in unpaid area @ Nirman Vihar Metro Station. CT/GD Nayak of CISF QRT Team responded promptly and saved the child. #PROTECTIONandSECURITY #SavingLives@HMOIndia@AmitShah @MoHUA_India pic.twitter.com/F4QBYEOOMc— CISF (@CISFHQrs) February 28, 2022