కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటనలో జాప్యం చోటుచేసుకుంది. ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన కొచ్చి వెళ్లాల్సి ఉంది. అయితే ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం చోటుచేసుకోవడంతో .. ఆయన ప్రయాణం రద్దైంది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం హైదరాబాద్ వచ్చిన ఆయన కేరళలోని కొచ్చికి వెళ్లాల్సి ఉంది. అయితే ఆయన ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో ఆయన పర్యటన తాత్కాలికంగా రద్దు అయింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోనే ఉన్నారు. మరో విమానం ఏర్పాటు చేసిన తర్వాత కొచ్చికి బయలు దేరనున్నారు. అప్పటి వరకు ఆయన రాత్రి బస చేసిన నేషనల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ అకాడమీ (ఎన్ఐఎస్ఎ)లో ఉండనున్నారు. ఆయన వెంట బండి సంజయ్, మరికొంత మంది బిజెపి నేతలు ఉన్నారు. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి.
సిఐఎస్ఎఫ్ రేజింగ్ పరేడ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు వచ్చారు. ఆదివారం ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కొచ్చి వెళ్లాల్సి ఉంది. అక్కడ పార్టీ నేతలతో భేటీ కావాల్సి ఉంది. అంతలో ఆయన వచ్చిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆయన షెడ్యూల్ వాయిదా పడింది. మరో విమానం ఏర్పాటు చేసేంత వరకు ఆయన హైదరాబాద్ లోనే ఉండనున్నారు. ఆయన వెంట బిజెపి నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి తదితరులు ఉన్నారు. అంతకు ముందు అమరులకు సీఐఎస్‌ఎఫ్ 54వ రైజింగ్ డే లో పాల్గొన్న అమిత్ షా.. సీఐఎస్‌ఎఫ్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. 53 ఏళ్లుగా దేశ సేవలో సీఐఎస్‌ఎఫ్ కీలక పాత్ర పోషిస్తున్నదని చెప్పారు. సీఐఎస్ఎఫ్ డ్రోన్ టెక్నాలజీని మరింత బలోపేతం చేస్తామన్నారు. దేశ సేవలో ప్రాణాలర్పించిన..సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి అమిత్‌షా నివాళులర్పించారు.