నేమ్, ఫేమ్‌తో పాటు కావాల్సినంత అటెన్షన్ కోసం నేటి యువత పడే తాపత్రయం అంత, ఇంత కాదు. ఇందు కోసం సోషల్ మీడియాను, టెక్నాలజీని వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా నటీనటులు, మోడల్స్, ఫ్యాషన్ డిజైనర్ దుస్తుల దగ్గర నుండి యాక్సరీస్ వరకు ప్రతిదీ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
నేటి యువత ఫేమస్ అయ్యేందుకు వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు. కొన్ని సార్లు అవి సక్సెస్ అవుతుంటే మరికొన్ని సార్లు బెడిసి కొడుతుంటాయి. ఈ జాబితాలో సామాన్యులే కాదూ సెలబ్రిటీలు ఉన్నారు. నేమ్, ఫేమ్‌తో పాటు కావాల్సినంత అటెన్షన్ కోసం వారి పడే తాపత్రయం అంత, ఇంత కాదు. ఇందు కోసం సోషల్ మీడియాను, టెక్నాలజీని వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా నటీనటులు, మోడల్స్, ఫ్యాషన్ డిజైనర్స్ దుస్తుల దగ్గర నుండి యాక్సరీస్ వరకు ప్రతిదీ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. తాజాగా ఓ ప్యాషన్ డిజైనర్.. ఓడ్రస్ ధరించి తన వైపు చూపు తిప్పుకునేలా చేసింది. ఎందుకంటే.. కాస్టీ అనుకుంటున్నారేమో..విభిన్నంగా ఉందనుకుంటున్నారా.. అవునండి మామూలుగా కాదూ..
తాజాగా ఓ ఫ్యాషన్ డిజైనర్ కూడా తనకున్న తెలివితేటలను ఉపయోగించి.. అందరిలా కాకుండా భిన్నంగా ఉండాలని స్పెషల్ దుస్తులను రూపొందించి, వాటిని ధరించి..సోషల్ సైనికులంతా తనవైపు అందరూ చూపు తిప్పుకునేలా చేసింది. ఇంతకు ఆమె ఏం చేసిందంటే..కరెన్సీ నోట్లతో తయారు చేసిన దుస్తులు ధరించి హోయలొలికిస్తోంది. ఆ యువతి డ్రెస్సును ధరించి, డ్యాన్స్ చేస్తూ.. వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంది. ఆమె వింత వింత డ్రెస్సులు ధరించి ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ వీడియో పోస్టు చేయగా వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అవాక్కయ్యారు. వావ్ ఏం క్రియేటివిటి అని అందరూ కొందరు, నడిచే ఏటీఎం అని మరికొందరు కామెంట్లు పెట్టారు.