viral video: ప్రతీ ఒక్కరి జీవితంలో పెళ్లనేది ఓ గుర్తుండి పోయే ఘట్టం. అందుకే దాన్ని మరుపురాని మధురానునభూతిగా మలుచుకోవటానికి ప్రయత్నిస్తుంటారు చాలామంది. మరికొంతమంది పెళ్లిని తమకు మాత్రమే కాదు.. చూసే వారందరికీ గుర్తిండిపోయేలా చేద్దామనుకుంటారు. అందుకే.. ట్రెండ్‌ను ఫాలో అవ్వకుండా సెట్ చేయటానికి దారులు వెతుకుతుంటారు.
విమానంలో, నీళ్లలో, అగ్ని పర్వతం దగ్గర కొండ అంచున ఇలా.. చాలా రకాల పెళ్లిళ్లు మనం చూసుంటాము. ఇప్పుడు చెప్పుకోబోయేది వాటికి భిన్నమైంది. ఓ జంట 400 అడుగుల ఎత్తులో.. గాల్లో పెళ్లి చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన రియాన్, కిమ్‌లు ప్రొఫెషనల్ స్లాక్ లైనర్స్( గాల్లో వేలాడే తాళ్లపై నడిచే వాళ్లు).
ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే, తమ పెళ్లి సాధారణంగా జరగకూడదని వారు భావించారు. పెళ్లి అందరికీ గుర్తుండిపోయేలా ఉండాలనుకున్నారు. అందుకే! గాల్లో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. దానికి తమ ప్రొఫెషనలిజాన్ని జోడించారు. కట్ చేస్తే.. వీరి పెళ్లి 400 అడుగుల ఎత్తులో.. గాల్లో జరిగింది.
ఓ భారీ సాలె గూడును పోలిన ఆకారంలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఉటాహ్‌లోని మోవాబ్ కొండ లోయల్లో నాలుగు వైపులా కట్టిన ఆ సాలె గూడులాంటి ఆకారంలో పెళ్లి జంటతో కలిపి మొత్తం ఆరుగురు ఉన్నారు. ఈ పెళ్లి జరిగింది 2018లో అయినా.. ఇందుకు సంబంధించిన వీడియో మరోసారి వైరల్‌గా మారింది. మరి, గాల్లో పెళ్లిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Viral Video: 1956 నాటి ఫ్రిడ్జ్.. దాని ముందు ఇప్పటి ఫ్రిడ్జ్‌లు ఎందుకూ పనికి రావు!