కొంత మంది ట్రెండ్ సెట్ చేస్తారు. మిగతా వాళ్ళు ఆ ట్రెండ్ ని ఫాలో అవుతారు. తెలంగాణకి చెందిన ఓ పెళ్లి కూతురు.. తన పెళ్లి బారాత్ లో బుల్లెట్ బండి పాటకి డ్యాన్స్ వేయడం, అక్కడ నుండి ఆ పాట ట్రెండ్ అవ్వడం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా.. ఇపుడు ఈ పాట లేకుండా.., రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు శుభకార్యాలు జరగడం లేదు.
ఓ ప్రభుత్వ హాస్పిటల్ లో ఈ పాటకి డ్యాన్స్ వేసిన నర్స్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే.. హాస్పిటల్ వర్క్ టైమింగ్ లో ఇలా డ్యాన్స్ వేయడం ఏమిటని.. ఆ నర్స్ పై అధికారులు చర్యలు తీసుకున్నారు. అధికారుల నిర్ణయంపై కూడా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ తరువాత ఎంపీలు, ప్రజా నాయకులు, సెలబ్రెటీలు అంతా బుల్లెట్ బండి పాటకి డ్యాన్స్ లు వేశారు. అయితే.., ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ కోసం డ్యాన్స్ చేసిన సందర్భాలు మాత్రమే. కానీ.., ఇప్పుడు బుల్లెట్ బండి పాటని వైద్యం కోసం వాడింది ఓ నర్స్. ఇప్పుడు ఈ ప్రయత్నమే నెటిజన్స్ ని ఆశ్చర్యపరుస్తోంది.
పక్షవాతం వచ్చిన పేషంట్స్ కి ఫిజియో ధెరఫీ చాలా అవసరం. వారిలో నరాలను ఉత్తేజపరచి, బ్లడ్ ఫ్లోటింగ్ సరిగ్గా జరగడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే.., మీకు తెలుసా? మనసు ఉత్తేజంగా ఉండి, ఎలాంటి టెన్షన్స్ లేకుండా, హ్యాపీగా ఉన్నా.. మన బాడీలో ఫంక్షనింగ్ అంతా సరిగ్గా జరుగుతుంది. దీనిని.. ప్రాక్టికల్ గా నిరూపించింది ఓ నర్స్.
పక్షవాతంతో బెడ్ పై పడుకుని ఉన్న పేషంట్ ముందు.. బుల్లెట్ బండి పాటకి డ్యాన్స్ వేసి.. అతనిలో జోష్ నింపింది నర్స్ . బుల్లెట్ బండి పాటకి, నర్స్ స్టెప్పులకి ఖుషీ అయిన ఆ పేషంట్ కూడా పని చేస్తున్న తన ఒక్క చేతిని పైకి ఎత్తి డ్యాన్స్ చేస్తూ.. ఉల్లాసంగా కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దీంతో.., ఏ రోగికైనా ఇంతకు మించిన ట్రీట్మెంట్ ఏముంటుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.