ఈ మధ్య కాలంలో కొందరు యువకులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. రోడ్డుపై ఆడది కనిపిస్తే చాలు.. ఐ లవ్ యూ అని చెప్పడం కాదంటే అత్యాచారం, ఆపై హత్యలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో రోజుకొక చోట కనిపిస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి ఘటనలోనే ఓ దుర్మార్గుడు బరితెగించి ప్రవర్తించాడు. ఒంటరిగా కనిపించిన ఓ యువతిని పట్టుకుని వేధించాడు. ఇక అంతటితో ఆగక ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించి తిడుతూ పైశాచిక అనందాన్ని. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.
అది ఉత్తర్ ప్రదేశ్ లోని కౌశంబిలో ప్రాంతం. ఇటీవల ఓ యువతి నడిరోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంది. ఇదే సమయంలో ఆమెకు ఎదురుగా ఓ యువకుడు వచ్చాడు. వస్తూ వస్తూనే ఆ యువతి రెండు చేతులు పట్టుకున్నాడు. ఆ తర్వాత యువతితో అసభ్యకరంగా మాట్లాడుతూ ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తించాడు. ఇక ఇంతటితో ఆగకుండా ఆ యువతి చెంపై కొడుతూ, కాళ్లతో తంతూ పైశాచిక ఆనందాన్ని పొందాడు. ఇదంత గమనించిన కొందరు స్థానికులు ఆ యువకుడిని ప్రశ్నించారు.
దీంతో భయపడి ఆ యువతిని వదిలేశాడు. దీంతో ఆ యువతి అక్కడి నుంచి పరుగులు తీసింది. ఇదంతా మరో వ్యక్తి తన సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నాడు. ఇక ఇదే వీడియో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ కోపంతో ఊగిపోయారు. ఇలాంటి దుర్మార్గులను అస్సలు వదిలి పెట్టకూడదని, కఠినంగా శిక్షించాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒంటరిగా కనిపించిన ఆడపిల్లపై ఈ దుర్మార్గుడు వ్యవహిరించిన తీరుపై మీరు ఎలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) December 19, 2022