Viral Video: రిఫ్రిజిరేటర్ దాన్నే సింపుల్‌గా షార్ట్ కట్‌లో ఫ్రిడ్జ్ అని పిలుస్తుంటారు చాలా మంది. ఒకప్పుడు స్టేటస్ సింబల్‌గా ఉన్న ఈ వస్తువు.. ఇప్పుడు నిత్యావసరంగా మారిపోయింది. డబ్బున్న వాడు.. మధ్యతరగతి వాడు అన్న తేడాలు లేకుండా అందరూ ఫ్రిడ్జ్‌లను వాడేస్తున్నారు. ఇన్‌స్టాల్‌మెంట్ల పుణ్యమా అని మధ్య తరగతి వారి ఫ్రిడ్జ్ కల నెరవేరుతోంది. ధర విషయానికొస్తే.. ఓ రకం మంచి ఫ్రిడ్జ్ రూ. 15వేలనుంచి స్టార్ట్ అవుతుంది. సింగిల్ డోర్‌తో తక్కువ ఫీచర్స్‌తో ఈ ఫ్రిడ్జ్ వస్తుంది.
ధర ఎక్కువ పెట్టే కొద్దే దాని ఫీచర్స్, డిజైన్ మారుతుంది. లక్ష రూపాయలు పెడితే ఓ అద్భుతమైన ఫ్రిడ్జ్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇక, ఫ్రిడ్జ్‌ల చరిత్ర విషయానికి వస్తే.. క్రీస్తు పూర్వం నుంచే ఫ్రిడ్జ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఇప్పటిలాగా మంచిమంచి డిజైన్లలో కాదు. అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా ఉండేవి. 500 బీసీలో ఓ పెద్ద ఇళ్లు లాగా ఉండేది.
తర్వాత రూపు మారుతూ 1830 నాటికి ఓ టేబుల్‌లాగా అందుబాటులోకి వచ్చింది. 1900లో ఫ్రిడ్జ్‌లకు ఇప్పటి రూపం వచ్చింది. కేవలం రూపమే కాదు.. 1956లో రూపొందించిన ఓ ఫ్రిడ్జ్‌లో ఇప్పటి ఫ్రిడ్జ్‌ల కంటే ఎక్కువ ఫీచర్లు ఉండేవి. ధర కూడా దాదాపు 200 డాలర్లు ఉండొచ్చని అంచానా.. ప్రస్తుతం ఆ ఫ్రిడ్జ్‌కు సంబంధించిన ఓ యాడ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Why’s this 66 year old fridge better than the one I got now pic.twitter.com/oFfu1CFfvI
— Lost in history (@lostinhist0ry) July 22, 2022
ఇవి కూడా చదవండి : వీడియో: ఫుల్ గా తాగి.. వీధి రౌడీల్లా కొట్టుకున్న అమ్మాయిలు!