మనకు అప్పుడప్పుడు చికాకు, కోపం వస్తుంటాయి. వాటి నుంచి రిలాక్సేషన్ కోసం పుస్తకాలు చదవడమో, కామెడీ వీడియోలు చూడ్డమో చేస్తుంటాం. అయితే వీటికంటే చిన్నపిల్లలతో మాటకలిపితే.. తెలిసి తెలియని వారి బుజ్జిబుజ్జి మాటలు మనకు ఇంకా ఎక్కువ సంతోషాన్ని, హాయిని ఇస్తాయి. వారి అమయకత్వంతో కూడిన మాటలు మనకు నవ్వులు తెప్పిస్తాయి. అలాంటి ఓ బుడ్డోడు వాళ్ల సార్ తో “సార్ సీరియల్ టైమ్ అవుతుంది. గబగబ తినండి.. నేను ఇంటికి పోవాలి” అంటూ మాట్లాడిన మాటలు కామెడీ పువ్వులు పూయించాయి. ఇప్పుడు ఈ బుడ్డోడి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
పాఠశాలలోని ఓ ఉపాధ్యాయుడికి భోజన సమయంలో ఓ బుడ్డోడు తోడు ఉన్నాడు. కానీ వాడి మనసంతా టీవీలో రాబోయే సీరియల్, సినిమా పైనే ఉంది. వెళ్తామంటే సార్ తినడం పూర్తికాలేదు. చూశాడు.. చూశాడు.. ఇంకా ఆగలేక ‘సార్.. గబగబ తినండి సార్. నాకు సీరియల్ టైమ్ అవుతుంది’ అని ధైర్యం చేసి చెప్పాస్తాడు. సీరియల్ చూస్తే నీ చదువు పాడైపోతుంది కదరా అని వాళ్ల సార్ అంటే.. ఏమి కాదులే సార్.. నేను ఆది సీరియల్ చూడాలి అంటూ అమాయకంగా అంటాడు. వీడి మాటలకు ఆ ఉపాధ్యాయుడు కూడా తెగ నవ్వుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ బుడ్డోడి మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.