జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు నివాసంలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని పిండి వంటలు చేస్తున్న సమయంలో గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పారు.
ప్రమాదంలో విద్యాసాగర్ రావు భార్య సరోజకు మంటలు అంటుకున్నాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
ఇది చదవండి : ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు సత్యరాజ్
ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే ఇంట్లో అగ్నిప్రమాదం జరిగిందన్న వార్త తెలియగానే నియోజకవర్గ ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.