బిడ్డలు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటారు. అలానే వారు మంచి ఉన్నత స్థితిలోకి వెళ్లి సుఖంగా ఉండాలని తల్లిదండ్రులు భావిస్తుంటారు. తమ తల్లిదండ్రులు ఆశలను నిరవేర్చే ప్రయత్నంలో ఉన్న కొందరిపై విధి కన్నెర్ర చేస్తుంది. వారిని తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లి.. వారి తల్లిదండ్రులకు గుండెకోతను మిగుల్చుతుంది
బిడ్డలు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటారు. అలానే వారు మంచి ఉన్నత స్థితిలోకి వెళ్లి సుఖంగా ఉండాలని తల్లిదండ్రులు భావిస్తుంటారు. రేయింబవళ్లు కష్టపడి.. వచ్చిన సంపాదనతో బిడ్డలను చదివిస్తారు. అయితే ఇలా తల్లిదండ్రులు తమపై పెట్టుకుని నమ్మకాన్ని వమ్ము చేయకుండా చాలా మంది పిల్లలు తమ లక్ష్యాలను సాధిస్తున్నారు. అయితే మరికొందరు విషయంలో మాత్రం విధి చిన్న చూపు చూస్తుంది. తమ తల్లిదండ్రులు ఆశలను నిరవేర్చే ప్రయత్నంలో ఉన్న కొందరిపై విధి కన్నెర్ర చేస్తుంది. వారిని తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లి.. వారి తల్లిదండ్రులకు గుండెకోతను మిగుల్చుతుంది. తాజాగా అలాంటి విషాదం మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
మెదక్ జిల్లా పెద్ద శంకరం పేట మండలం కమలాపూర్ కు చెందిన బాలరాజు సావిత్రి భార్యాభర్తలు. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వీరిలో పెద్ద అమ్మాయి సౌజన్య(13) తూప్రాన్ పరిధిలోని పోతరాజ్ పల్లి పులే గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. సౌజన్య తోటి విద్యార్థులతో ఎంతో కలివిడిగా ఉంటుంది. అంతేకాక చదువులో సైతం చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తల్లిదండ్రుల కూడా సౌజన్య బాగా చదివి వృద్ధిలోకి వస్తుందని, ఆమె మంచి ఉద్యోగం చేసి.. కుటుంబానికి ఆసరాగా ఉంటుందని భావించారు.
ఇలా సంతోషంగా సాగుతున్న సౌజన్యకు వారం రోజులుగా ఆరోగ్యం బాగాలేదు. నాలుగు రోజుల కిందట ఆరోగ్యం మరింత క్షీణించడంతో పాఠశాల నిర్వాహకులు సౌజన్య తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు వచ్చి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సౌజన్య మృతి చెందింది. ఆ బాలిక మృతితో ఆమె తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. తమ కూతురు వృద్ధిలోకి వస్తుందని ఆశించామని, విద్యాలయంలో క్షేమంగా ఉందనుకున్నామని తల్లిదండ్రులు వాపోయారు.
తమ బిడ్డ మరణానికి గురుకుల పాఠశాల నిర్వాహకులే కారణమని బాధితురాలి బంధువులు ఆరోపించారు. అలానే ఆదివారం గురుకులం ఎదుట మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. ఆమె తమ ఇంటికి వెలుగని సంబరపడ్డ ఆ తల్లిదండ్రులకు బిడ్డ మరణం గుండెకోతను మిగిల్చింది. మరి.. విద్యాలయాల్లో విద్యార్థులు అనారోగ్య పాలవుతున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. వీటిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.