ఎవరైన విలువైన వస్తువు పోతే.. దానిని తిరిగి పొందేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తారు. చివరకు ఆ వస్తువు ఆచూకీ తెలియక తీవ్ర నిరాశలో ఉండిపోతారు. కొంతకాలానికి దాని విషయం మరచిపోతారు. అయితే అలా పోయిందనుకున్న వస్తువు ఏళ్లు గడిచిన తరువాత దొరికితే ఆ సంతోషం వేరేగా ఉంటుంది. అలాంటి అనుభవమే ఓ వ్యక్తికి కలిగింది.
మనం ఎంతో ఇష్టపడి కొనుకున్న విలువైన వస్తువు కనిపించకుండా పోతే ఎంతో బాధవేస్తుంది. దానికి గురించి ఆలోచిస్తూ కొన్ని రోజులు బాధ పడతాము. కొన్నాళ్లకు దాని గురించి మరచిపోయి.. మన పనుల్లో మనం నిమగ్నమై పోతాము. అలా కొన్ని ఏళ్లు గడిచిన తరువాత.. పోయిన వస్తువు తిరిగి కనిపిస్తే ఎగిరి గంతులేస్తారు. అచ్చం అలాంటి సంతోషమే ఓ వ్యక్తి విషయంలో జరిగింది. పదేళ్ల క్రితం తాను పొగొట్టుకున్న బైక్.. ఇటీవల దొరికింది. దీంతో పోయిందనుకున్న తన బైక్ దొరడంతో సంతోషంలో మునిగితేలుతున్నాడు. మరి.. పదేళ్ల క్రితం పోయిన బైక్ ఇప్పుడు ఎలా దొరికిందో ఇప్పుడు తెలుసుకుందాం..
హైదరాబాద్‌లోని యూసఫ్ గూడకు చెందిన ఓ వ్యక్తి పదేళ్ల క్రితం మాసాబ్ ట్యాంక్‌లోని జేఎన్టీయూ-ఎఫ్ ఆఫీస్ బయట తన ద్విచక్ర వాహనాన్ని పార్క్ చేసి.. లోపలికి వెళ్లాడు. అక్కడ తన పని ముగించుకుని తిరిగొచ్చేసరికి బయట తన బైక్ కనిపించలేదు. తన బైక్ మిస్సింగ్ పై హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం బైక్ ఆచూకి కనిపెట్టేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
అలానే తన బైక్ విషయం గురించి తెలుసుకునేందుకు బాధితుడు పలుమార్లు పోలీస్ స్టేషన్ కు వెళ్లేవాడు. అలా ఎన్ని సార్లు తిరిగిన ఫలితం లేకుండాపోవడంతో విసుగు చెందిన బాధితుడు.. బైక్ గురించి మరచిపోయాడు. అలా బైక్ మాయమైన తరువాత పదేళ్లు గడిచిపోయింది. అయితే అతడిని ఆశ్చర్యానికి గురిచేస్తూ పదేళ్ల తరువాత ఇటీవల బైక్ కనిపించింది. సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ పోలీసుల నుంచి శుక్రవారం సదరు వ్యక్తి ఓ నోటిస్ వచ్చింది. “గత రెండు రోజులుగా మీ వాహనం నో పార్కింగ్ ప్రాంతంలో ఉంది.
వాహన పత్రాలతో వచ్చి చలాన్ కట్టి తీసుకెళ్లండి” అని ఆ నోటీస్ లో రాసి ఉంది. బైక్ నెంబర్, దాని మీద ఉన్న చిరునామా ఆధారంగా ట్రాఫిక్ పోలీసులు ఆ లేఖ పంపారు. పదేళ్ల క్రితం చోరీకి గురైన ఆ బైక్ పై అతడు ఎప్పుడో ఆశలు వదిలేసుకున్నాడు. అలాంటి సమయంలో తన బైక్ తిరిగి దొరికిందని ఆ వ్యక్తి ఆనందంతో ఎగిరి గంతేశారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.