సంతోషాలు-కష్టాలు కలగలిపి వస్తేనే దాన్ని జీవితం అంటారు. అలా కాకుండా కేవలం కష్టాలు మాత్రమే జీవితాన్ని ముంచేస్తే.. కచ్చితంగా విషాదం అంటారు. అలాంటి విషాదమే ఓ ఇంటి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ఆ ఇంటి ఇల్లాలు అనారోగ్యం ఆ కుటుంబాన్ని ప్రతీ క్షణం వేధిస్తోంది. ఉన్న ఇద్దరు పిల్లలకు పెళ్లిళ్లు చేసి వారి పిల్లలతో సదరాగా ఆడుకోవాల్సిన ఆమె.. మంచానికే పరిమితమైంది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దాసర్లపల్లి గ్రామానికి చెందిన ఆండాలు అనే మహిళ బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ అయి పక్షవాతం వచ్చింది. అర్జెంట్‌గా ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు.
ఇందుకోసం రూ.2 లక్షలు ఖర్చవుతుందన్నారు. ఆమె కూతురు పెళ్లి కోసం దాచిన డబ్బును ఖర్చుపెట్టి ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ సక్సెస్ అయింది. అయితే, ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. బ్రెయిన్ సర్జరీ కావడంతో ఆండాలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతోందని, మరో ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. ఇందుకోసం బాగా ఖర్చు అవుతుందని కూడా తెలిపారు. తనకు భార్య కంటే ఏదీ ఎక్కువకాదని భావించిన ఆమె భర్త అంజయ్య ఆపరేషన్‌కు సరేనన్నాడు. కూతురి పెళ్లి కోసం దాచిన మిగిలిన డబ్బులు కూడా ఆపరేషన్‌కు కట్టాడు.
సహాయం చేయటానికి ఇక్కడ క్లిక్ చేయండి
వైద్యులు ట్రైకాస్టమీ సర్జరీ చేశారు. సర్జరీ తర్వాత 24 రోజులపాటు అత్యాధునిక ట్రీట్మెంట్ చేశారు. ఇందుకోసం ఏకంగా రూ.7.50 లక్షలు ఖర్చు అయింది. అయినప్పటికి ఆమె పరిస్థితి మామూలు కాలేదు. దీంతో మరో 20 రోజులు ఆస్పత్రిలో ఉంచారు. ఈ 20 రోజులకు గానూ ఏకంగా 4 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఈ నాలుగు లక్షల కోసం అంజయ్య ఎంతో కష్టపడ్డాడు. కూతురు పెళ్లి కోసం దాచిన డబ్బు అయిపోగా.. 4 లక్షల కోసం బయట అప్పు చేశాడు. కొద్దిరోజుల తర్వాత ఆమెను సికింద్రాబాద్ లోని శ్రద్దా రిహాబిలేషన్ సెంటర్‌లో జాయిన్ చేశారు. అక్కడ కూడా మరో రూ.3.50 లక్షల వరకు ఖర్చు చేశారు. అప్పు తెచ్చిన లక్షల డబ్బు కూడా నీళ్లలా ఖర్చయిపోయింది. ఇక, అంజయ్య చేతిలో చిల్లి గవ్వలేకుండాపోయింది.
బయట అప్పు ఇచ్చే పరిస్థితి కూడా లేకపోయింది. దీంతో ఆండాలును ఇంటికి తీసుకెళ్లిపోయాడు. ఈ టైంలోనే ఆ కుటుంబానికి మరో కొత్త కష్టం వచ్చి పడింది. బ్రెయిన్ సర్జరీలో భాగంగా ఆమె తలపై సగానికి పైగా తొలగించిన బోన్ (పుర్రె) రీప్లేస్‌మెంట్‌కోసం రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. ఈ బోన్ రీప్లెస్ మెంట్ తొందరగా చేయించకపోవతే ఆమె ప్రాణానికి ప్రమాదమని కూడా వైద్యులు హెచ్చరించారు. ఇప్పటివరకు ఆమె ఆపరేషన్ల కోసం ఏకంగా 12 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేసిన ఆ కుటుంబానికి రూ. 2లక్షలు పెను భారంగా మారాయి. ఈ నేపథ్యంలోనే సహాయం చేసే దాతల కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఓ నిండు ప్రాణాన్ని కాపాడే మంచి పనిలో మీరూ భాగాస్వాములు కండి. ఓ కుటుంబంలో వెలుగులు నింపండి.
సహాయం చేయటానికి ఇక్కడ క్లిక్ చేయండి