ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది . సిటీ బస్సుల విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు హైదరాబాద్ సీటీలో బస్సులు అర్థరాత్రి వరకే తిరుగుతుండేవి. దీంతో అర్థరాత్రి తరువాత ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడేవారు. అధిక ఛార్జీలతో గమ్యాలు చేరే వారు. ఆసమయంలో ప్రయాణికుల భద్రత కూడా ప్రశ్నర్థకమే. ఈ క్రమంలో తెలంగాణా ఆర్టీసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సీటీ బస్సులను ఇక నుంచి 24 గంటలు నడపనున్నారు. ప్రయాణికుల డిమాండ్, రద్దీ ఉన్న రూట్లలో అర్థరాత్రి నుంచి తెల్లవారు జామున 4గంటల వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఈ నైట్ షిఫ్ట్ బస్సులు డిపోలకు చేరుకొనే సమయానికి రెగ్యులర్ బస్సులు తిరిగి రోడ్డెక్కుతాయి. ఈ నిర్ణయంతో హైదరాబాద్ సిటీలోని ప్రయాణికులు ఆర్టీసీ సేవలను 24 గంటల పాటు వినియోగించుకోవచ్చును.
ఇప్పటికే పలు మార్గాల్లో నైట్ బస్సులు ప్రయోగాత్మకంగా నడుపుతున్నారు. వీటికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. దీంతో ఈ సరికొత్త నిర్ణయానికి ఆర్టీసీ నాంది పలికింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో నగరానికి ఆలస్యంగా చేరుకొనే ప్రయాణికులు, తెల్లవారు జామునే దూరప్రాంతాలకు బయలుదేరేవారికి ఈ బస్సులు అనుకూలంగా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాలాల్లో తిరుగుతున్న బస్సులకు ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో డిమాండ్ మేరకు నగరంలోని మరిన్ని మార్గాల్లో బస్సులను ప్రవేశపెడుతామని ఆర్టీసీ సికింద్రాబాద్ రీజనల్ మేనేజర్ వెంకన్న తెలిపారు. ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి పటాన్చెరు వరకు అర్థరాత్రి 12 నుంచి తెల్లవారు జాము వరకు 2 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఆఫ్జల్‌గంజ్, మెహదీపట్నం, బోరబండ, తదితర ప్రాంతాలకు కూడా నైట్ బస్సులను నడుపుతున్నారు.
ఇదీ చదవండి: డిస్కంలో తొలి లైన్ ఉమన్‌గా శిరీష నియామకం!ఈ మార్గాల్లో ప్రతి అరగంట నుంచి 45 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. సికింద్రాబాద్ చిలకలగూడ క్రాస్‌రోడ్డు నుంచి హయత్‌నగర్ వరకు మరో రెండు బస్సులు నడుస్తున్నాయి. అలాగే చిలకలగూడ నుంచి ఇబ్రహీంపట్నం వరకు నైట్ బస్సులను నడుపుతున్నారు. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ నుంచి లింగంపల్లి నైట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ నైట్ బస్సుల్లో అన్ని రకాల పాస్‌లను అనుమతిస్తారు. 24 గంటల పాటు చెల్లుబాటయ్యే ట్రావెల్ యాజ్ యు లైక్ (TAYL) టిక్కెట్లపైనా ప్రయాణికులు నైట్ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు. మరి.. తెలంగాణ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.