ఈ మధ్య ఆర్టీసీ మేనేజ్‌మెంట్ ప్రయాణికులను ఆకర్షించేందుకు చాలా ప్రయోగాలు చేస్తుంది. మొన్నటికి మొన్న రెండు బంఫర్ ఆఫర్లను ప్రకటించింది. హైదరాబాద్ నగరంలోని మహిళా ప్రయాణీకులతో పాటు సీనియర్ సిటిజన్స్ కోసం టీ-6ను, ఫ్యామిలీ కోసం ఎఫ్-24ను తీసుకువచ్చిన సంగతి విదితమే. ఇ
మనం ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే టూవీలర్, ఫోర్ వీలర్‌లలో వెళతాం. కొంచెం దూర ప్రయాణాలకు బస్సు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ మధ్య తెలంగాణ ఆర్టీసీ మేనేజ్‌మెంట్ ప్రయాణికులను ఆకర్షించేందుకు చాలా ప్రయోగాలు చేస్తుంది. మొన్నటికి మొన్న రెండు బంఫర్ ఆఫర్లను ప్రకటించింది. హైదరాబాద్ నగరంలోని మహిళా ప్రయాణీకులతో పాటు సీనియర్ సిటిజన్స్ కోసం టీ-6ను, ఫ్యామిలీ కోసం ఎఫ్-24ను తీసుకువచ్చిన సంగతి విదితమే. ఇక వేసవిలో నేపథ్యంలో రద్దీగా ఉండే రూటైన విజయవాడ వెళ్లే ప్రయాణికులకు రాయితీ కల్పించిన సంగతి తెలిసిందే. కొత్తగా జనరల్ రూట్ పాస్‌లను అమలులోకి తెచ్చింది. ఇలా చాలా ఆఫర్స్ ఇవ్వడం వల్ల ప్రయాణికులు బస్సు ప్రయాణాలకు ఆకర్షితులవుతున్నారు. అయితే తాజాగా టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు మరో ఆఫర్‌తో ముందుకు వచ్చింది.
తెలంగాణ ఆర్టీసీ నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. దూర ప్రాంతాలకు వెళుతున్న ప్రయాణికులకు టికెట్ తోపాటే స్నాక్స్‌బాక్స్‌ను ఇస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. బస్ టికెట్‌తో పాటే స్నాక్స్‌బాక్స్ కూడా ఇవ్వడంతో బస్సును మధ్యలో ఎక్కువ సార్లు నిలిపే అవసరం లేదని అధికారులు తెలిపారు.మొదట హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే 9 ఈ-గరుడ బస్సుల్లో స్నాక్స్‌బాక్స్ ప్రవేశపెడుతున్నారు. ఈ విధానం ఈరోజు నుండే అమలులోకి తెస్తున్నారు. దీంతో ప్రయాణికుల రెస్పాన్స్ ను బట్టి తర్వాత అన్ని సర్వీసులకు అందజేయనున్నారు. 2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది.
ఈ నేపథ్యంలో సంపూర్ణ ఆరోగ్యం అందరికి అందించాలనే యోచనతో చిరుధాన్యాలతో చేసిన కారా, చిక్కి ప్యాకెట్లు ఆర్టీసీ సంస్థ అందజేయనుంది. ఇందుకుగాను తెలంగాణ ఆర్టీసీ టికెట్ పై మరో రూ.30 అదనంగా వసూలు చేయనుంది. ప్రయాణికులు ఈ విధానాన్ని ఆదరించి విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని టీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ కోరుతున్నారు. ఈ విధానం వల్ల ఆర్టీసీ సంస్థ ప్రయాణికులకు మరింత చేరువయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరి తెలంగాణ ఆర్టీసీ.. ప్రయాణికుల కోసం చేసే వినూత్న విధానంపై మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి.