ఒకప్పుడు దేశంలో ఆడవారు వంటింటికే పరిమితం అవుతూ.. ఎలాంటి స్వేచ్చ లేకుండా కుటుంబమే తమ జీవిత పరమార్ధంగా భావించి జీవించేవారు. కానీ ప్రస్తుత కాలంలో మగవారితో సమానంగా అడవారు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారు. పురుషులతో దీటుగా పని చేస్తారు. ఇక అదే విషయాన్ని నిరూపించింది తెలంగాణలో తొలి లైన్ ఉమన్ గా రికార్డు సృష్టించిన ఓ యువతి. టీఎస్ఎస్పీడీసీఎల్ తొలిసారిగా ఓ మహిళ లైన్ ఉమెన్‌గా ఎంపికై రికార్డుల్లోకెక్కింది. బబ్బూరి శిరీష అనే యువతి తొలి లైన్ ఉమెన్‌గా ఉద్యోగిగా నియామకం అయ్యింది. శిరిషకు నియామక పత్రాన్ని అందించి అభినందించారు మంత్రి జగదీశ్ రెడ్డి.
ఇది చదవండి: Nalgonda: తాను చనిపోతూ.. ఐదుగురి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్!
సిద్దిపేట జిల్లాకు చెందిన శిరీష మేడ్చల్ మల్కాజిగిరిలో తన చదువును అభ్యసించింది. టిఎస్ఎస్పిడిసిఎల్ లో జేఎల్ఎం పోస్టుల కోసం ఇటీవల జరిగిన రిక్రూట్మెంట్లో ఉద్యోగాన్ని పొందిన ఏకైక మహిళ శిరీష. మొత్తం 38 మంది అమ్మాయిలు దరఖాస్తు చేయగా 32 మంది పరీక్ష రాశారు. వీరిలో 11 మంది ఉత్తీర్ణులైనా ఇద్దరు మాత్రమే కరెంటు స్తంభం ఎక్కే పరీక్షలో నెగ్గారు. వీరిద్దరిలో ఒకరికి ఇటీవల ట్రాన్స్‌కోలో ఉద్యోగం రాగా శిరీష డిస్కంలో చేరారు. రాష్ట్రంలోని రెండు విద్యుత్తు పంపిణీ సంస్థల్లో కూడా ఆమె ఒక్కరే పదవిలో ఉన్నారు.
ఇది చదవండి: ఆధార్ – పాన్ లింక్ చేయలేదా? అయితే.. ఇకపై లావాదేవీలు చేయడం కష్టమే..!
ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. అడవారు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారని.. విద్యుత్ శాఖలో మహిళలు కొత్త బాటలో పయనిస్తూ జేఎల్‌ఎం పోస్టులలో నియామకాలు చేపట్టడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు. చరిత్రలో శిరీష నిలిచిపోతుందని.. గతేడాది తీసుకున్న నిర్ణయం మేరకు 200 పైచిలుకు లైన్ ఉమెన్లను ట్రాన్స్ కోలో తీసుకున్నామని జగదీష్ రెడ్డి తెలిపారు. లైన్మెన్ పోస్టుల్లో మహిళలను కూడా నియమిస్తున్నందున గతంలో సూచించిన విధంగా లైన్మెన్ పోస్టుల నామకరణాన్ని మార్చి లింగభేదం లేకుండా చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశ చరిత్రలో లైన్ ఉమెన్‌గా ఉద్యోగం ఇచ్చిన సంస్థగా టీఎస్ ఎస్పీడిసిఎల్ నిలుస్తోందన్నారు.
టీఎస్ ఎస్పీడిసిఎల్ లో తొలిసారిగా లైన్ ఉమెన్ గా ఉద్యోగం పొందిన శిరిషకు నియామక పత్రాన్ని అందించి, అభినందించిన మంత్రి జగదీశ్ రెడ్డి,పాల్గొన్న టీఎస్ ఎస్పీడిసిఎల్ సీఎండీ రఘుమా రెడ్డి ఇతర ఉన్నతాధికారులు.@trspartyonline @KTRTRS @TelanganaCMO pic.twitter.com/EDH4eh3LOR
— Jagadish Reddy G (@jagadishTRS) May 11, 2022
- మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్‌లోడ్ చేసుకోండి.