ఎండాకాలం వచ్చిందంటే చాలా మంది విహారయాత్రలకు ప్లాన్ చేస్తుంటారు. పుణ్య క్షేత్రాలు, పర్యాటక స్థలాలను తిలకించేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. ఇందుకోసం ఎక్కువ శాతం టూరీజం బస్సుల్లో ప్రయాణాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు.
వేసవి కాలాం వచ్చిందంటే అందరికీ విహార యాత్రలు గుర్తుకు వస్తాయి. ఏడాదికి ఒక్కసారి ఒక వారం లేదా పదిరోజులు విహారయాత్రంలు చేసి వస్తే ఏడాది మొత్తం పడ్డ శ్రమ మర్చిపోతాము. వేసవిలో చాలా వరకు తమ కుటుంబంతో పుణ్యక్షేత్రాలు, హీల్స్ స్టేషన్లకు వెళ్తుంటారు. ఈ సందర్బంగా పర్యాటక, చారిత్రక, పుణ్య క్షేత్రాలు ఉన్న ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లకు సిద్దమైంది. తాజాగా షిరిడీ వెళ్లే యాత్రికులకు టీ సర్కార్ శుభవార్త అందించింది. పూర్తి వివరాల కోసం..
వేసవి సీజన్ లో చాలా మంది పుణ్యక్షేత్రాలు, పర్యాటక స్థలాలు పర్యటించడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు. ఈ క్రమంలో షిరిడీ వెళ్లే యత్రికులకు తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ క్రమంలో తెలంగాణ టూరిజం శాఖ షిరిడీ యాత్రికులక కోసం రెండు ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. హైదరాబాద్ నుంచి షిరిడీ వెళ్లే యాత్రికులకు తక్కువ ధరకే ప్యాకేజీ ప్రకటించింది. షిరిడీ వెళ్లే పర్యాటకుల కోసం ఏసీ, నాన్ ఏసీ ప్యాకేజీలను అధికారులు విభజించారు. ఏసీ బస్సుల్లో ప్రయాణానికి టికెట్ ధర పెద్దలకు రూ.3,700, చిన్న పిల్లకు రూ.3,010 గా నిర్ణయించారు. ఇక నాన్ ఎసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు టికెట్ ధర రూ.2,400, పిల్లలకు రూ.19700 లుగా నిర్ణయించారు.
ఇందుకోసం పలు ఏరియాలను పిక్ పాయింట్ల కింద ఏర్పాటు చేశారు ఆర్టీసీ అధికారులు. ప్రతిరోజూ సాయంత్రం ప్యారడైజ్, బేగంపేట, కేపీహెచ్ బి, బషీర్ బాగ్, దిల్‌షుక్‌నగర్, మియా పూర్ నుంచి బస్సులు బయలుదేరుతాయని టీఎస్ టీడీసీ అధికారులు తెలిపారు. బస్సులు హూటల్స్ కి ఉదయం 7 గంటల వరకు చేరుకుంటాయి. ప్రయాణికులు సిద్దమైన తర్వాత దర్శనానికి బయలుదేరి.. దర్శనం తర్వాత దగ్గరలోని ఇతర ఆలయాలను కూడా దర్శించుకోవచ్చు. తిరిగి బస్సు షిరిడీ నుంచి సాయంత్రం 4 గంటలకు బయలు దేరి ఉదయం 6.30 గంటల వరకు హైదరాబాద్ కి చేరుకుంటుంది. బాబా దర్శనం కోసం ముందుగానే రిజర్వ్ చేసుకోవాలని.. మధ్యాహ్నం భోజన ఏర్పాట్ల కోసం యాత్రికులు తమ సొంతఖర్చుతో భరించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. షిరిడీ టూర్ కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం https://tourism.telangana.gov.in/package/ShirdiTour చూడాల్సిందిగా అధికారులు తెలిపారు.