రెండు అక్షరాల ప్రేమ ఎప్పుడు ఎవరి మధ్య ఎలా పుడుతుందో చెప్పలేము. ప్రేమకు రంగు, జాతి, మతం, కులం, దేశం అంటూ హద్దులు ఏమి ఉండవు. ఈ ప్రేమ అనేది రెండు మనస్సులను భలే విచిత్రంగా కలుపుతుంది. ద్వేషం ఉన్న వాళ్ల మధ్యనే ప్రేమ పుడుతుందంటే..దానికి ఉన్న శక్తి ఎంతదో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ ప్రేమకు హద్దులు అంటూ ఏమి ఉండవు. ఎల్లలు దాటి ప్రేమించుకున్న చాలా మంది పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇలాంటి ప్రేమ ఘటనలు అనేకం జరిగాయి. అలాంటి ప్రేమ కథా చిత్రామ్ తాజాగా తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది. అమెరికా అమ్మాయి.. తెలంగాణ కుర్రాడిని ప్రేమించి పెళ్లిచేసుకుంది. మరి వారిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది. పెళ్లి పీటలు ఎక్కే వరకు వారు సాగించిన పోరాటం ఏమిటనేది ఇప్పు తెలుసుకుందాం..
నిజామాబాద్ జిల్లా గోవింద్ పేట్ కు చెందిన మూగ దేవారం, శుభామణి దంపతుల కొడుకు ఆకాశ్. అతడు భారత్ లోని ఓ క్రైస్తవ స్వచ్ఛంద సేవ సంస్థలో పని చేస్తుండే వాడు. ఇదే సమయంలో అమెరికాకు చెందిన లేసి అలెక్స్ అదే క్రైస్తవ సంస్థంలో నర్సుగా పనిచేస్తున్నారు. కొంతకాలం క్రితమే ఆమె అమెరికాలో నర్సింగ్ శిక్షణ పూర్తి చేసుకుని భారత్ కు వచ్చారు. ఇక్కడ ఆకాశ్ పనిచేస్తున్న క్రైస్తవ సంస్థలోనే ఆమె నర్సుగా చేరింది. ఈక్రమంలో ఆకాశ్ తో లేసి అలెక్సస్ ఓల్సన్ కు పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల తరువాత ఆ పరిచయం కాస్తా వారి మధ్య ప్రేమకు దారి తీసింది. దాదాపు 5 ఏళ్ల పాటు ఆకాశ్, అలెక్సస్ ప్రేమించుకున్నారు. చివరకు తమ ప్రేమ విషయాన్నిపెద్దలకు తెలియజేశారు. కాస్తా సమయం తీసుకున్న ఇరు కుటుంబాలు అంగీకారం తెలపడంతో పెళ్లి పీటలెక్కారు.
మంగళవారం ఆర్మూర్ పట్టణం కొటార్మూర్ లోని తిరుమల గార్డెన్స్ లో వీరి వివాహం జరిగింది. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఆకాశ్, అలెక్స్ ల వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి అమెరికా నుంచి అలెక్స్ తల్లిదండ్రులు ట్రాయ్ అలన్ ఓల్సన్, జహ్మీ డెవిస్ తో పాటు మరికొందరు బంధువులు పెళ్లి హాజరయ్యారు. వారందరూ భారతీయ ఆచార సంప్రదాయాల ప్రకారం ఇక్కడి వస్త్రాధారణలో మెరిశారు. అంతేకాక ఈ వివాహ వేడుకకు స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు భారీగా హజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎల్లలు దాటిన ఈ ప్రేమ జంట.. పెళ్లి బంధంతో ఒక్కటైంది. మరి.. ఈ నూతన జంట ప్రేమ వివాహంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.