కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అని ప్రజలు ఆందోళనలో ఉన్నారు. విద్యార్థుల విషయానికి వస్తే వారి పరీక్షలు ఎప్పుడు? ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే ధ్యాసలో ఉన్నారు. కరోనా మహమ్మారి దృష్ట్యా పరీక్షలు వాయిదా పడే అవకాశం కూడా లేకపోలేదు. మొదట ఇంటర్ పరీక్షలను ఏప్రిల్ లో నిర్వహిస్తామన్న తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పుడు ఆ పరీక్షలను మేలో నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కరోనా కేసుల పెరుగుదల దృష్ట్యా మేలో నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. మే 2 నుంచి పరీక్షలు ప్రారంభించి మే 20 కల్లా పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా ఆఫ్ లైన్ తరగతులు ఆలస్యంగా ప్రారంభం అయ్యాయి. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ తో పాటు మళ్లీ కేసులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. తాజాగా విడుదలైన ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 2.35 లక్షల మంది విద్యార్థులు మొదట ఫెయిల్ కాగా.. వారిని మినిమం మార్కులతో పాస్ చేసిన విషయం తెలిసిందే.