తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ తర్వాత కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ ఇప్పుడు కరోనా కొత్త రూపం ఒమిక్రాన్ వేరియంట్ జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 67 కి చేరాయి. తాజాగా తెలంగాణలో నూతన సంవత్సర వేడుకల నియంత్రణపై జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెల్చిచెప్పింది. న్యూఇయర్ వేడుకలపై ఇప్పటికే పోలీసులు మార్గదర్శకాలు జారీ చేశారని తెలిపింది.
ఇది చదవండి : ఈ మేకకు ‘చికెన్ బిర్యానీ’ లేనిదే ముద్ద దిగదు
పబ్‌లు, బార్లలో వేడుకల సమయాన్ని మరింత పెంచారని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దిల్లీ, మహారాష్ట్ర తరహాలో ఆంక్షలు విధించాలని కోరారు. అయితే, పరిస్థితులను బట్టి రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకుంటాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే మార్గదర్శకాలు ఉల్లంఘించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న దానిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను జనవరి 4కు వాయిదా వేసింది.