తెలంగాణలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా ముసురు పడుతుంది. పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వానలు కురుస్తున్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో అయితే ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. పలు ప్రాంతాల్లో మోస్తరుగా, మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. మరో మూడురోజులపాటు హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చిరిస్తోంది. మిగిలిన జిల్లాల్లో కూడా అదే పరిస్థితి. నగరవాసులు సోమవారం నుంచి కురుస్తున్నవానలకు బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఇతర జిల్లాల్లో కూడా వర్షాల ప్రభావం ఎలా ఉందో.. మరిన్ని వివరాలను తెలుసుకుందాం..
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. గతమూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగు రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. రాష్ట్రంలో ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. గురు, శుక్ర, శనివారాల్లో కూడా భారీ వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో భారీగా వర్షం కురుస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో అక్కడక్కడ రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. అర్ధరాత్రి డీఆర్ ఎఫ్ టీమ్స్ కు 50 ఫిర్యాదులు వచ్చాయి.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంపీ హెచ్చరికలు చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, భద్రాద్రి, ఖమ్మం, జనగామ, యాదాద్రిలో అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. భూపాపల్లి, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. వాతావరణ శాఖ తెలంగాణలోని 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 10 జిల్లాలకు ఎల్లో అలర్డ్ జారీ చేసింది.
మరోవైపు ఈ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బొగత జలపాతం వద్ద ప్రవాహం ప్రమాదకరంగా ఉండడంతో పర్యాటకుల సందర్శనను నిలిపివేశారు. అలాగే గోదావరికి కూడా వరద పెరిగింది. గోదావరికి వరద పెరుగుతుండటంతో భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.