ఇటీవల దేశ వ్యాప్తంగా కొంతమంది కేటుగాళ్లు నకిలీ ఐడీ కార్డులు సృష్టించి అమాయకులను మోసం చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఎక్కువగా కస్టమ్స్ ఆఫీసర్లుగా, పోలీస్ కానిస్టేబుల్ గా ఫేక్ ఐడీ కార్డుతో ప్రజలను మోసం చేస్తున్నారు.
ఈ మద్య కొంతమంది కేటుగాళ్లు నకిలీ ఐడీ కార్డులతో ఘరానా మోసాలకు పాల్పపడుతున్నారు. ఎన్నో రకాలుగా నకిలీ ఐడీలు సృష్టించి కస్టమ్స్ ఆఫీసర్స్, ట్రాఫిక్ కానిస్టేబుల్, డాక్టర్లు గా చెలామని అవుతూ ఎంతోమంది మందిని మోసం చేస్తు పోలీసులకు పట్టుబడుతున్నారు. నకిలీ ఐడీ కార్డుతో చెలామణి అవుతున్న ఓ మహిళను పోలీసులు గుర్తించి అరెస్ట్ చేసిన ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది.
హైదరాబాద్ లో నకిలీ మహిళా కానిస్టేబుల్ గుట్టు రట్టయ్యింది. పోలీస్ నకిలీ ఐడీ కార్డు తయారు చేసుకొని ఏకంగా నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం కేంద్రంగా మహిళ అనేమ మందిని ఉద్యోగాల పేరుతో మోసం చేసింది. అంతేకాదు ముగ్గురు యువకులను దారుణంగా మోసం చేసి వారిని దొంగతనాలకు ప్రేరేపించింది. ఎట్టకేలకు ఈ మాయలేడీని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి లంగర్ హౌజ్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. లంగర్‌హౌస్‌లో నివాసం ఉంటున్న అశ్విని అనే మహిళ ఇంటర్ వరకు చదువుకుంది. మొదటి నుంచి జల్సాలకు అలవాటు పడిన ఆమె తర్వాత అశ్విని రెడ్డిగా పేరు మార్చుకొని తాను హైదరాబాద్ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నట్లు ఓ నకిలీ ఐడీ కార్డుని క్రియేట్ చేసుకుంది.
మహిళా పోలీస్ కానిస్టేబుల్ అంటూ బిల్డప్ ఇస్తూ ఈసీఐఎల్ లో ఉంటున్న రోహిత్ కిషోర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి పాప, బాబు జన్మించారు. నాలుగేళ్ల తర్వాత రోహిత్ అనే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకొని భర్తను చంపించేందుకు ప్లాన్ చేసింది. మరోపక్క ఇద్దరు యువకులతో ఎఫైర్ పెట్టుకొని వారిని చోరీలు చేయాల్సిందిగా ప్రేరేపించింది. అలా దొంగతనాలు చేస్తూ రోహిత్ అనే యువకుడు జైలుపాలయ్యాడు. ప్రస్తుతం మెహదీపట్నంలో అభిషేక్ అనే వ్యక్తితో సహజీవనం కొనసాగిస్తుంది. నకిలీ పోలీస్ ఐడీ కార్డుతో నిరుద్యోగ యువకులను మోసం చేస్తూ డబ్బులు వసూళ్లు చేసింది.
ర్యాపిడో బైక్ పై ప్రయాణిస్తూ బషీర్ బాగ్ లోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వద్దకు వెళ్లి అక్కడ యువకులను బయట ఉంచి తాను ఒంటరిగా లోపలికి వెళ్లి తిరిగి బయటకు వచ్చి ప్రస్తుతం సార్ లేడని.. మీ పని అవుతుందని డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పి వసూళ్లు చేస్తూ వచ్చింది. ఇలా చేసి అభిషేక్ ని ట్రాప్ లో పడేసి అతనితో సహజీవనం చేస్తుంది. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా బలవంత పెట్టింది.. అతడు కాదు అనేసరికి పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఈమె చేస్తున్న మోసాల గురించి ఫిర్యాదులు రావడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.