తమకోసం జీవితాన్ని త్యాగం చేసిన తల్లి విషయంలో కొందరు బిడ్డలు దారుణంగా ప్రవర్తిస్తుంటారు. పున్నామ నరకం నుంచి కాపాడుతారనుకుంటే.. బతికుండగానే నరకం చూపిస్తుంటారు. అయితే ఇలాంటి కసాయి కొడుకులు.. ఓ వ్యక్తిని చూసి బుద్ధి తెచ్చుకోవాలి.
ఈ భూమిపై స్వార్ధం లేని ప్రేమ అంటూ ఉందంటే.. అది కేవలం అమ్మ ప్రేమ మాత్రమే. బిడ్డలను నవమాసాలు మోసి.. కని..ఏ స్వార్థం లేకుండా పెంచుతుంది. అయితే తమకోసం జీవితాన్ని త్యాగం చేసిన తల్లి విషయంలో కొందరు బిడ్డలు దారుణంగా ప్రవర్తిస్తుంటారు. పున్నామ నరకం నుంచి కాపాడుతారనుకుంటే.. బతికుండగానే నరకం చూపిస్తుంటారు. అయితే ఇలాంటి కసాయి కొడుకులు.. ఓ వ్యక్తిని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. తన తల్లి ఆరోగ్యం కోసం ఎండను సైతం లెక్క చేయకుండా ఓ సాహస యాత్ర చేశాడు. మరి… అతడు ఎవరు.. అమ్మ ఆరోగ్యం కోసం అతడు చేసిన ఆ సాహసం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
నిర్మల్ జిల్లా ఖానాపుర్ గ్రామానికి చెందిన మల్లయ్య తన కుటుంబతో కలిసి నివాసం ఉంటున్నాడు. మల్లయ్య తల్లి కూడా ఆయన వద్దే ఉంటుంది. ఆమెను ఎంతో జాగ్రత్తగా, ప్రేమగా మల్లయ్య చూసుకునే వాడు. అయితే ఇటీవల కొంతకాలం నుంచి ఆమె ఆరోగ్యం సరిగ్గా లేదు. చాలా ఆస్పత్రులు చూపించిన పూర్తిగా ఆరోగ్యం మెరుగు పడలేదు. దీంతో జగిత్యాల జిల్లాలోని శ్రీ కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకుని, అక్కడ కొద్ది రోజులు గడిపితే.. తల్లి ఆరోగ్యం బాగుపడుతుందని నమ్మాడు. దీంతో తన తల్లి ఆరోగ్యం బాగుకోసం 70 కి.మీ దూరంలో ఉన్న కొండగట్టు ఆంజనేస్వామి గుడికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు.
తల్లి కోసం మల్లయ్యా ఓ చెక్కబండిని తయారు చేయించాడు. అందులో తన తల్లిని కూర్చొబెట్టుకుని సుమారు 70 కిలో మీటర్లు ప్రయాణించాడు. సోమవారం ఖానాపూర్ నుంచి కర్రలతో తయారు చేసిన ఆ చెక్కబండిలో తన తల్లిని కూర్చొబెట్టి.. తాను తోసుకుంటూ ప్రయాణం సాగించాడు. తన తల్లి ఆరోగ్యం సరిగ్గా లేదని, కొండగట్టు తీసుకెళ్తే.. కుదుట పడుతుందని నమ్మకమని మల్లయ్య అన్నారు. తన వద్ద డబ్బులు లేకున్నా..తల్లి ఆరోగ్యం ముఖ్యమని మల్లయ్య తెలిపాడు. తన తల్లి ఆరోగ్యం బాగుపడుతుందంటే.. ఎక్కడికైనా తీసుకెళ్తానని ఆయన తెలిపాడు. మరి.. తల్లి ఆరోగ్యం కోసం పరితపిస్తున్న ఈ కుమారుడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.