మానవత్వం లేదు అని చెప్పుకునే వర్మ.. ఫస్ట్ టైం మానవత్వాన్ని ప్రదర్శించారు. ఎమోషన్స్ లేవు అని చెప్పుకునే వర్మ ఎమోషనల్ అయ్యారు. జంతు ప్రేమికులపై ఒక్కసారిగా సీరియస్ అయ్యారు.
అంబర్ పేట్ కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. మేయర్ పై తనదైన శైలిలో చురకలు అంటించారు. మేయర్ ని కుక్కల మధ్యలో వదిలేయాలంటూ కామెంట్స్ చేశారు. దీంతో విషయం కాస్తా సీరియస్ అయ్యింది. వర్మ స్పందించడంతో ఈ ఘటన దీనికి సంబంధించి ఒక వీడియోని కూడా పోస్ట్ చేశారు. కాగా ఓ ప్రముఖ టీవీ ఛానల్ కుక్కల దాడి ఘటనపై డిబేట్ నిర్వహించగా ఆ చర్చలో వర్మ పాల్గొన్నారు. బాలుడి మృతి విషయంలో ఎవరు బాధ్యులు అనే అంశం మీద చర్చ పెట్టగా.. ఈ చర్చలో వర్మతో పాటు బాధితులు, జంతు ప్రేమికులు, మేయర్ మద్దతుదారులు కూడా పాల్గొన్నారు.
కుక్కల దాడి ఘటనలో బాలుడు చనిపోవడంపై తప్పు ఎవరిదన్న చర్చ నడుస్తోంది. జీహెచ్ఎంసీదా? లేక తల్లిదండ్రులదా? లేక కుక్కలదా? అనే చర్చ నడుస్తున్న సమయంలో జంతు ప్రేమికులు ఇది పూర్తిగా తల్లిదండ్రుల నిర్లక్ష్యమే అని స్టేట్మెంట్ ఇచ్చారు. పిల్లాడ్ని నిర్లక్ష్యంగా వదిలేసిన తల్లిదండ్రులదే తప్పు అని జంతు ప్రేమికులు అంటున్నారు. అంతే దీని మీద బాధితులు జంతు ప్రేమికులపై సీరియస్ అయ్యారు. తల్లిదండ్రులు కావాలని తీసుకెళ్లి కుక్కల దగ్గర పడేస్తారా? కొంచెం కూడా మానవత్వం లేకపోతే ఎలా అని మండిపడ్డారు. మానవత్వం ఉన్న వారు అయితేనే ఇక్కడ ఉండండి లేదా వెళ్లిపోండి అంటూ సీరియస్ అయ్యారు. జంతు ప్రేమికుల కామెంట్స్ పట్ల పిల్లాడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక వర్మ కూడా జంతు ప్రేమికులపై సీరియస్ అయ్యారు. కొడుకు పోయిన బాధలో తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి కోపంగా మాట్లాడటం అనేది వాళ్ళ క్యారెక్టర్. వాళ్ళది అసలు తప్పే లేదు. మేయర్ ని ప్రాజెక్ట్ చేయాల్సింది పోయి తప్పుని తల్లిదండ్రుల మీద తోసేస్తారేంటి అని వర్మ సీరియస్ అయ్యారు. ఈ డిబేట్ లోకి తనను ఎందుకు పిలిచారో, బాధితులను ఎందుకు పిలిచారో, జంతు ప్రేమికులను ఎందుకు పిలిచారో తెలియదు కానీ దీనికి ఒకటే సొల్యూషన్ అని చెప్పారు. వాళ్ళనైనా పొమ్మనండి, లేదా నేనైనా పోతాను అని సీరియస్ అయ్యారు. సొల్యూషన్ లేని దానికి ఇంత డిస్కషన్ అనవసరం అని లేచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు.
ఎప్పుడూ వర్మ ఈ విధంగా సీరియస్ అవ్వలేదు. మొదటిసారి ఇలా జంతు ప్రేమికులపై, అలానే మేయర్ మద్దతుదారులపై సీరియస్ అయ్యారు. ఎప్పుడూ మానవత్వం లేదు, మానవత్వం లేదు అని చెప్పుకునే వర్మ.. ఫస్ట్ టైం మానవత్వాన్ని ప్రదర్శిస్తుండగా నెటిజన్స్ కూడా వర్మకు సపోర్ట్ చేస్తున్నారు. తనకు ఎమోషన్స్ లేవు అని చెప్పుకునే వర్మ ఇలా భావోద్వేగానికి గురవ్వడం పట్ల నెటిజన్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. వర్మ హండ్రెడ్ పర్సెంట్ రైట్ అని కామెంట్స్ చేస్తున్నారు. మరి వర్మ బాధితుల పక్షాన నిలబడి మానవత్వాన్ని ప్రదర్శించడం పట్ల, అలానే జంతు ప్రేమికులపై సీరియస్ అవ్వడం పట్ల మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.