సాధారణంగా బంగారం, వాహనాలు, డబ్బుల దొంగతనాలు చూసి ఉంటాము. కానీ విచిత్రం అందరూ ఉపయోగించే టాయిలెట్ చోరి జరిగింది. ఈ టాయిలేట్ చోరీలో ఇంటి దొంగ హస్తం ఉందని తెలింది. ఇటీవల ఏటీఎంలో బ్యాటరీలను చోరీ చేస్తే ఇవాళ ఏకంగా సులభ్ కాంప్లెక్స్ ఎత్తేశారు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని మల్కాజిగిరి పరిధిలో ప్రజల సౌకర్య కోసం GHMC అధికారులు పబ్లిక్ టాయిలెట్ చోరి అయింది. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ నిందితుడిని అరెస్టు చేశారు. పబ్లిక్ టాయిలెట్ ను చోరి చేసి అందులోని ఇనుమును అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజా అవసరాలను తీర్చేందుకు పెద్ద సంఖ్యలో అధికారులు ఏర్పాటు చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో నిర్వహణ లేకపోవడంతో నిరూపయోగంగా మారాయి. అలాంటి వాటిపై కన్నేసిన కొందరు రాత్రిళ్లు చోరీలకు పాల్పడుతున్నారు. ఆ తరహాలోనే మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో ఓ పబ్లిక్ టాయిలెట్ మాయమైంది. అధికారుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీలక సమాచారం రాబట్టారు.బుద్ధభవన్ లో పనిచేసే జీహెచ్ఎంసీ ఉద్యోగి అరుణ్ కుమార్ ఈ చోరీలో హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జైన్ బాలజీ కన్ కస్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్న భిక్షపతితో కలిసి దొంగిలించిన ఇనుప టాయిలెట్ ను మూషిరాబాద్ లో రూ.45 వేలకు అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సోమ్మును స్వాధీనం చేసుకోవడంతో పాటు జోగయ్యను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరి..ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.