ఈ మధ్య కాలంలో వాహనదారులు పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని పదే పదే చెప్పినా వాహనదారులు ఎంతకు తీరు మార్చుకోవటం లేదు. దీంతో పోలీసులు కఠిన నిబంధనలను అములు చేస్తూ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. గతంలో చాలా మంది బండికి ఒక చలనా ఉందంటే భయపడి పోయి పోలీసుల వద్ద కట్టుకునే వారు. కానీ ఇప్పుడు సాంకేతికంగా భారీ మార్పులు రావటంతో పోలీసులు ఆన్‌లైన్ పేమెంట్‌లకు వాహనదారులకు అవకాశం కల్సించారు.
ఇక అవకాశాన్ని అదును చేసుకుంటున్నారు వాహనదారులు. హెల్మెంట్ లేకపోయినా, నెంబర్ ప్లేట్ లేకపోయినా, ట్రిపుల్ డైవింగ్ అయినా ఇలా దేనికైనా పోలీసులు ఫోటో తీయటం బండి నంబర్ ఆధారంగా చలనా వేయటం జరుగుతోంది. అలా ఎన్నో చలనాలను కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. ఇక వాహనదారులు చలనాలు కట్టుకోవటానికి వెనకాడుతున్నారు. దీంతో పోలీసులు రూట్ మార్చి బండికి ఒక్క చలనా ఉన్నా సీజ్ చేస్తామంటూ గట్టిగా హెచ్చరిస్తున్నారు.
ఇటీవల హైదరాబాద్‌లోని పర్వతినగర్‌లో నిఖిలేష్ అనే న్యాయవాది పోలీసులకు చిక్కాడు. తన చలనాలను ఆన్‌లైన్‌లో చూడగా రూ.1650 గా ఉంది. చలనా నగదును చెల్లించాలని పోలీసులు కోరగా ఆయన నిరాకరించాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఆ బండిని సీజ్ చేశారు. ఒక్క చలనాకే బండిని ఎలా సీజ్ చేస్తారని వారితో వాగ్వాదానికి దిగాడు. దీంతో మాదాపూర్ ట్రాఫిక్ సీఐ శ్రీనివాసులు బండికి ఒక్క చలానా ఉన్న నిబంధనల ప్రకారం వాహనాన్ని సీజ్ చేస్తామని ఆయన తెగేసి చేప్పారు.