మందు బాబులకు తాగేందుకు ఇల్లు, బార్, మద్యం దుకాణాలు సరిపోవడం లేదు. లిక్కర్ షాపుల్లో మద్యం కొనుగోలు చేసి.. ఎక్కడి పడితే అక్కడ తాగుతూ రచ్చ చేస్తున్నారు. మద్యం షాపుల్లో ఫూటుగా తాగేసి నడిరోడ్డుపై చిందేసే మందు బాబులు కొందరైతే.. ఇంట్లో తాగి కిక్కురుమనకుండా
మందు బాబులకు తాగేందుకు ఇల్లు, బార్, మద్యం దుకాణాలు సరిపోవడం లేదు. లిక్కర్ షాపుల్లో మద్యం కొనుగోలు చేసి.. ఎక్కడి పడితే అక్కడ తాగుతూ రచ్చ చేస్తున్నారు. మద్యం షాపుల్లో ఫూటుగా తాగేసి నడిరోడ్డుపై చిందేసే మందు బాబులు కొందరైతే.. ఇంట్లో తాగి కిక్కురుమనకుండా పడుకునేవారు మరికొందరు. కానీ పది మంది తిరిగే చోట కూడా మద్యం సేవిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు కొంత మంది. మొన్నటికి మొన్న హైదరాబాద్ మెట్రో స్టేషన్ వద్ద ఇద్దరు వ్యక్తులు మందు తాగుతూ కెమెరా కంటికి చిక్కిన సంగతి విదితమే. మెట్రోను ఆసరాగా చేసుకుని మద్యం సేవిస్తున్నారు. తాజాగా ఇద్దరు పోకిరీలు నడి రోడ్డులో మందు కొడుతున్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతుంది.
హైదరాబాద్ ట్రాఫిక్ జంక్షనల్లో ట్రాఫిక్ పోలీసుల కోసం ఏర్పాటు చేసిన ఓ బూత్‌లో ఇద్దరు పోకిరీలు కూర్చొని మద్యం తాగుతూ.. బిర్యానీ తింటున్న ఘటన ఒకటి వెలుగు చూసింది. దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నెట్టింట్ల హల్ చల్ చేస్తోంది. ఈ ఘటన మాదాపూర్ హైటెక్ సిటీ జంక్షన్‌లో చోటుచేసుకుంది. ఎప్పుడూ రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ఆ బూత్‌ను మందు కొట్టేందుకు అడ్డాగా మార్చుకున్నారు. ఏ మాత్రం భయం లేకుండా.. పట్టపగలే ఈ దుస్సాహానికి ఒడిగట్టారు. ఈ వీడియో చూసిన చాలా మంది ఇదేంటయ్యా నడిరోడ్డుపై ఈ పనులేంటయ్యా అంటూ కామెంట్లు పెట్టారు. తాగుబోతులకు ప్రైవసీ ఇవ్వదు ఈ సమాజం అని, కొంత మంది రాజకీయాల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లింది. కేసు నమోదు చేసిన అధికారులు.. వీడియో, అక్కడి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. సంగం గణేష్, వెంగలదాస్ గోపీ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
హైటెక్ సిటీ జంక్షన్ ట్రాఫిక్ పోలీస్ బూత్‌లో మద్యం సేవించిన సంగం గణేష్, వెంగలదాస్ గోపి అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. https://t.co/nBu7XFvfeg pic.twitter.com/DDw7aF1zLy
— Telugu Scribe (@TeluguScribe) July 26, 2023