ఐపీఎల్ మ్యాచులకు ఆతిథ్యం ఇచ్చేందుకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. రేపు మ్యాచ్ నేపథ్యంలో స్టేడియానికి వెళ్లే ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. మరిన్ని వివరాలు..
ధనాధన్ క్రికెట్‌తో హైదరాబాదీలను అలరించేందుకు ప్లేయర్లు సిద్ధమవుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సర్వం సిద్ధమైంది. ఏప్రిల్ 2న (ఆదివారం) మధ్యాహ్నం 3.30 గంటలకు సన్ రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ఈ మ్యాచ్ ఏర్పాట్ల మీద రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్‌కు 1,500 మంది పోలీసు సిబ్బందితో పకడ్బందీగా భద్రతను ఏర్పాటు చేశామని డీఎస్ చౌహాన్ చెప్పారు.
మ్యాచ్ చూసేందుకు వచ్చే ప్రేక్షకుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు డీఎస్ చౌహాన్. ట్రాఫిక్ చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. క్రికెట్ మ్యాచ్ ముగిసిన తర్వాత పోలీసులు సూచించిన మార్గాల్లో వెళ్లాలని తెలిపారు. బ్లాక్‌లో టికెట్లను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మ్యాచ్ మధ్యలో ఎవరూ స్టేడియం లోపలికి రావొద్దన్నారు. అలా వస్తే కేసులు నమోదు చేస్తామని చౌహాన్ స్పష్టం చేశారు. ఈసారి కొత్త టెక్నాలజీని వినియోగిస్తున్నామని తెలిపారు. ఛీర్ గర్ల్స్ వ్యవహారంలో ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్టేడియంకు వచ్చే వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశామని చౌహాన్ వివరించారు.
కాగా, రేపు ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అభిషేక్ మహంతి అన్నారు. స్టేడియానికి నాలుగు ప్రధాన మార్గాల్లో వెహికిల్స్‌ను అనుమతిస్తామని చెప్పారు. భారీ వాహనాలకు ఉప్పల్ స్డేడియం వైపు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఉప్పల్ స్డేడియానికి వచ్చే ప్రధాన మార్గాల్లో ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం 1 గంటల నుంచి రాత్రి 10.30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. వరంగల్ హైవే నుంచి నగరంలోకి వచ్చే భారీ వాహనాలు.. చెంగిచెర్ల చౌరస్తా, చెర్లపల్లి, ఐవోసీఎల్, ఎన్ఎఫ్సీ మీదుగా వెళ్లాలని సూచించారు. మల్లాపూర్ నుంచి నాచారం ఐడీఏ వైపు వెళ్లే హెవీ వెహికిల్స్ చెర్లపల్లి, చెంగిచెర్ల మీదుగా వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు.
In view of @IPL 2023 Match on 02.04.2023 at RGI Cricket Stadium, Uppal, Hyderabad @RachakondaCop #TrafficNotification pic.twitter.com/JAFJlR2nqf
— Rachakonda Traffic Police (@Rachakonda_tfc) March 31, 2023