హైదరాబాద్ వంటి నగరాల్లో ఉద్యోగం, వ్యాపారం, చదువులు, ఇతరత్రా పనులకు వెళ్లాలంటే అందులోనూ.. బస్సులో ప్రయాణించాలంటే గంటలు, గంటలు పడుతుంది. ఇక క్యాబ్, ఆటోల్లో వెళ్లాలంటే నెల జీతం సరిపోదు. ఇలాంటి తరుణంలో ప్రయాణీకులకు ఊరట కలిగించేలా..
హైదరాబాద్ వంటి నగరాల్లో ఉద్యోగం, వ్యాపారం, చదువులు, ఇతరత్రా పనులకు వెళ్లాలంటే అందులోనూ.. బస్సులో ప్రయాణించాలంటే గంటలు, గంటలు పడుతుంది. ఇక క్యాబ్, ఆటోల్లో వెళ్లాలంటే నెల జీతం సరిపోదు. ఇలాంటి తరుణంలో ప్రయాణీకులకు ఊరట కలిగించేలా.. నగరంలో ప్రధాన ప్రాంతాలను కలుపుతూ వచ్చింది మెట్రో. దీని సేవల్ని వినియోగించుకోని వారు ఉండరు. బస్సు చార్జీలతో సమానంగా.. అటు ఇటుగా ఉంటూ సౌకర్యవంతమైన, సులభతరమైన ప్రయాణాన్ని ఫీలవుతున్నాం. అయితే ఇప్పుడు ఈ మెట్రో స్టేషన్లలో చెత్త పనులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు కొంత మంది. మెట్రోలో బ్రష్‌లు చేయడం, డ్యాన్సులు, కిస్సింగ్, హగ్గింగ్స్ వంటి రోత పనులను చూశాం.
అయితే ఇప్పుడు మందుబాబులకు కూడా అడ్డాగా మారిపోయింది. ఖాళీగా ఉంటున్నమెట్రో స్టేషన్ల దగ్గర తాగుబోతులు హల్ చల్ చేస్తున్నారు. మద్యం దుకాణాల దగ్గర నుండి బాటిల్స్ తెచ్చుకోవడం. ఖాళీ స్థలాలను చూసి నిస్సుగ్గుగా మద్యం సేవిస్తున్నారు. అలాంటి ఓ దృశ్యమే పంజా గుట్ట ఫై ఓవర్ వద్ద కనిపించింది. మెట్రో స్టేషన్ వద్ద ఇద్దరు మందు కొడుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనను వీడియో తీసి కెటీఆర్, తెలంగాణ డీజీపికి ట్యాగ్ చేస్తూ.. పంజా గుట్ట స్టేషన్ వద్ద ప్రస్తుత పరిస్థితి ఇది అంటూ ట్వీట్ చేశాడు. మెట్రో స్టేషన్ కారిడార్, మెట్ల కింద ప్రాంతంలో వీరిద్దరూ మద్యం సేవిస్తుండగా.. ఈ వీడియో తీశాడు. అక్కడే చక్కగా కూర్చుని ఒకరు, నించొని ఒకరు మద్యం కొడుతున్నారు. ఇలా చేయడం వల్ల ప్రయాణీకులు ముఖ్యంగా మహిళ ప్రయాణీకులు ఇబ్బంది పడటంతో పాటు రిస్కులో పడే అవకాశం కూడా ఉంది. మరీ వీరిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
This is the current situation near Punjagutta @HyderabadMetroR station. Request @KTRBRS to take action @TelanganaDGP @NVSReddyIRAS pic.twitter.com/mf4fPj7vuF
— T A V Srinivas (@TAVSrinivas1) July 7, 2023