ప్రజలకు అలర్ట్. రేపు ఒక్కరోజు మీరు ఆ ఏరియాలో రెస్టారెంట్ కి వెళ్లినా తినలేరు. పార్క్ కి వెళ్లినా తిరగలేరు. ఎందుకంటే రేపు వాటిని మూసివేస్తున్నారు. ఎందుకంటే?
ఏప్రిల్ 14న పార్కులకు, సందర్శన స్థలాలకు, హోటల్స్ కు వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే హైదరాబాద్ లో ఏ ఏరియాకు వెళ్లినా గానీ ఈ ఏరియాలో మాత్రం రేపు ఒక్కరోజు అన్ని మూసివేయబడతాయి. గో కార్టింగ్, పార్కులు, సందర్శన స్థలాలు, రెస్టారెంట్లు సహా ఇతర సంస్థలు ఏమీ ఓపెన్ లో ఉండవు. ఎందుకంటే అధికారులు రేపు ఒక్కరోజు పలు సంస్థలను మూసి వేయాలని నిర్ణయించుకున్నారు. ప్రజల సౌకర్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇటీవల హనుమాన్ జయంతి సందర్భంగా ఊరేగింపు సమయంలో గొడవలు జరగకూడదని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మద్యం షాపులను, పబ్ లను, ఫైవ్ స్టార్ హోటల్స్ ను మూసివేస్తూ హైదరాబాద్ పోలీసులు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇక రేపు కూడా కొన్ని సంస్థలను మూసివేయాలని హెచ్ఎండీఏ అధికారులు నిర్ణయించారు.
ఏప్రిల్ 14న పార్కులు, రెస్టారెంట్లు మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. ఆ ఒక్కరోజు పార్కులు, రెస్టారెంట్లు తెరిచి ఉండవు. అయితే అన్ని పార్కులు, అన్ని రెస్టారెంట్లు కాదు. కేవలం కొన్ని పార్కులు, కొన్ని రెస్టారెంట్లు మాత్రమే. అది కూడా ఒక ఏరియా పరిధిలో మాత్రమే. ఎందుకంటే తెలంగాణలో నూతన సచివాలయం సమీపంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ (బీపీపీ) లో భాగంగా 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ మహోత్సవ వేడుక ఉంది.
ఈ కారణంగా ఆ పరిధిలో ఉన్న పార్కులు, రెస్టారెంట్లు ఏప్రిల్ 14 2023న అంటే శుక్రవారం నాడు మూసివేయబడతాయని ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరిస్తారని హెచ్ఎండీఏ తెలిపింది. ప్రజల సౌకర్యార్థం ఏప్రిల్ 14న సంస్థలను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నామని హెచ్ఎండీఏ అధికారులు వెల్లడించారు. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో ఉన్న ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబినీ పార్క్, ఎన్టీఆర్ ఘాట్, జల విహార్, సంజీవయ్య పార్క్, పిట్ స్టాప్ పార్క్, అమోఘం రెస్టారెంట్ సహా పలు సందర్శన స్థలాలను శుక్రవారం నాడు మూసివేయబడతాయని ప్రజలు గమనించాలని కోరారు.