మంచిర్యాల- బయట జోరు వాన కురుస్తోంది.. ఉరుములు, మెరుపులతో బయట పరిస్థితి బీబత్సంగా ఉంది. బయట కాలు పెట్టాలంటేనే వెన్నులో వణుకుపుడుతోంది. అటువంటి సమయంలో బాబుకు అనారోగ్యం చేసింది. తప్పని సరి పరిస్థితుల్లో పాపను తీసుకుని ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది. కానీ అంతలోనే అనుకోని ఆపద వచ్చింది. ప్రకృతి ప్రకోపానికి చిన్నారితో పాటు తల్లి ప్రాణాలు కోల్పోయింది. తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ హృదయ విషాదకర ఘటన తెలంగాణలోని మంచిర్యాల పట్టణంలో చోటు చేసుకుంది. స్థానిక రైల్వే ఫ్లై ఓవర్ పై బైక్‌పై వెళ్తున్న కుటుంబంపై పిడుగుపడడంతో ఎనిమిది నెలల బాబుతో పాటు తల్లి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఉదయం 11.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చిన్నారి తండ్రి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.మంథని మండలం గడ్డంపల్లి గ్రామానికి చెందిన అందే మౌనిక, కుమారుడు శ్రియాన్ అక్కడికక్కడే మృతి చెందగా వెంకటేష్ కు తీవ్రగాలయ్యాయి. మృత దేహాలను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంకటేష్ కు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. వెంకటేష్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఎనిమిది నెలల చిన్నారికి ఆరోగ్యం బాగోకపోవడంతో జోరువానలో ఆస్పత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు.
ఆస్పత్రి నుంచి తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. వర్షంలోనే వెళ్తుండగా అకస్మాత్తుగా వారిపై పిడుగు పడింది. భార్యాతో పాటు చిన్నారి పిడుగుకి బలి కాగా, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. నడి రోడ్డుపై విగత జీవులుగా పడి ఉన్న చిన్నారి, మహిళ మృత దేహాలు, తీవ్రగాయాలతో కొన ఊపిరితో కొట్టుకుంటున్న తండ్రి దృశ్యాలు స్థానికులను కలచివేశాయి. ప్రకృతి ప్రకోపానికి రెండు నిండు ప్రాణాలు బలైపోయాయి.