సాంకేతికత ఎంత పెరిగినా.. ప్రకృతి విపత్తులను అంచనా వేయడంలో మాత్రం మనిషి వెనకబడుతున్నాడు. ఫలితంగా ప్రకృతి విపత్తుల వల్ల ఏటా ఎంత మంది బాధపడుతున్నారో.. ఎందరు ప్రాణాలు కోల్పోతున్నారో… ఎంత నష్టం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి నష్టాలను అరికట్టడానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా లాభం లేకుండా పోతంది. ఇక గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక వర్షాల సందర్బంగా ఉరుములు, మెరుపులు, పిడుగులు పడటం సహజం. ఇక ప్రతి ఏటా పిడుగుపాటు కారణంగా.. వందల మూగ జీవాలు, మనుషులు మృత్యువాత పడటం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పిడుగుపాటు కారణంగా ఓ మహిళ ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలు కరిగిపోయాయి. ప్రస్తుతం ఆ మహిళకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ వివరాలు..
గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా పొచ్చర గ్రామ సమీపంలోని దిమ్మ అనే గ్రామ శివారులో వర్షంతో పాటు ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో వర్షం కురవసాగింది. ఈ క్రమంలో ఉన్నట్లుండి పిడుగు పడింది. ఈ సంఘటన చోటు చేసుకున్న సమయంలో పక్కనే పంట చేనులో శ్వేత అనే మహిళ వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంది. పిడుగు పాటు కారణంగా వెలువడిని వేడికి.. ఆ మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసు కరిగిపోయి శరీరానికి అతుక్కుపోయింది.
బాధితురాలి పరిస్థితిని గమనించిన స్థానికులు, తోటి కూలీలు వెంటనే 108 వాహనంలో ఆమెను జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రసుత్తం శ్వేతకు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ విషయం గురించి తెలిసిన వారు.. పిడుగుపాటు వల్ల చనిపోవడం.. చెట్లు కాలిపోవడం గురించి విన్నాం కానీ.. ఇలా ఒంటి మీద బంగారు ఆభరణాలు కరిగిపోవడం ఏంటి.. ఇలాంటి సంఘటన గురించి ఇప్పటి వరకు వినలేదు.. చూడలేదు అంటున్నారు.