సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, సెలబ్రిటీలకు ఒక్కోసారి చేదు అనుభవాలు ఎదురౌతుంటాయి. ఎక్కువ ప్రయాణ సమయాల్లో మన హీరోలు, హీరోయిన్లు అసహనానికి గురై.. సదరు విమానయాన సంస్థపై ఫైర్ అవుతూ ఉంటారు. రాజకీయ నేతలు చేపట్టే ర్యాలీలో కానీ, బహిరంగ సమావేశాల సమయంలో ప్రజలు పూలు, రాళ్లు, చెప్పులు, కోడిగుడ్లు విసురుంటారు.
సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, సెలబ్రిటీలకు ఒక్కోసారి చేదు అనుభవాలు ఎదురౌతుంటాయి. ఎక్కువ ప్రయాణ సమయాల్లో మన హీరోలు, హీరోయిన్లు అసహనానికి గురై.. సదరు విమానయాన సంస్థపై ఫైర్ అవుతూ ఉంటారు. అలాగే బయటకు వెళ్లిన సమయాల్లో కూడా అభిమానుల అత్యుత్సాహం ప్రదర్శించి ఇబ్బందులకు గురి చేస్తుంటారు. రాజకీయ నేతలు చేపట్టే ర్యాలీలో కానీ, బహిరంగ సమావేశాల సమయంలో ప్రజలు పూలు, రాళ్లు, చెప్పులు, కోడిగుడ్లు విసురుంటారు. కొన్ని సార్లైతే ఊహించని పరిణామాలకు గురౌతుంటారు. ఎటువంటి మానవ ప్రమేయం లేని, యాదృచ్చికంగా జరిగే సంఘటనల వల్ల నరకయాతన చూస్తుంటారు. తాజాగా అటువంటిదే ఎదుర్కొన్నారు తెలంగాణ మంత్రి వర్యులు. పని మీద బయటకు వెళ్లిన ఆయన.. అనుకోకుండా లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు.
ఇంతకు ఎవరు ఆ మంత్రి అంటే..? తెలంగాణ ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్. ఆయన లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. మంచిర్యాల జిల్లా చెన్నూరుకు వెళుతున్న ఆయన మార్గమధ్యంలో పెద్దపల్లిలో ఆగారు. స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి జిల్లా కేంద్రంలోని కూనారం చౌరస్తాలో తన అనుచరుని రెస్టారెంట్‌కు వెళ్లారు. తిరిగి కిందకు దిగే సమయంలో లిఫ్ట్‌ను ఆశ్రయించారు. సామర్థ్యం మించిపోవడంతో లిఫ్ట్ తలుపులు మూసుకున్నప్పటికీ.. లిఫ్ట్ కదలలేదు. అలా అని తెరచుకోనూ లేదు. దీంతో ఆయన లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారని గ్రహించిన పోలీసులు కాసేపు శ్రమించి తలుపులు తెరిచారు. అనంతరం మంత్రి నవ్వుకుంటూ బయటికొచ్చి ‘పెద్దపల్లి గుర్తుండిపోతుంది..’ అంటూ చెన్నూర్ పయనమయ్యారు. ఎప్పుడైనా మీకు ఇటువంటి అనుభవాలు ఎదురైతే..కామెంట్ల రూపంలో తెలియజేయండి