రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం ఎంతో మంది ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. ఈ క్రమంలో అక్కడి చట్టాలు తెలియక చిన్నచిన్న తప్పులకు ఏళ్ల తరబడి జైళ్లల్లో మగ్గుతున్నారు. ఇక దారుణం ఏమిటంటే అక్కడ చనిపోయిన పట్టించుకునే నాథుడే ఉండడు. కొందరు మాత్రమే అదృష్టం బాగుండి అక్కడి నుంచి బయటపడుతుంటారు. అలాంటి ఘటన హత్య కేసులో ఉరిశిక్ష పడిన శంకర్ విషయంలో జరిగింది.
తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది ఉపాధి కోసం దేశం కానీ దేశం వెళ్తున్నారు. వారు అక్కడ ఎన్నో కష్టాలు పడుతూ.. భారత దేశంలో ఉండే తమ వారికి డబ్బులు పంపిస్తుంటారు. అయితే ఉపాధి కోసం ఇలా విదేశాలకు వెళ్లిన మన వాళ్లు అక్కడి చట్టాలపై అవగాహన లేక చిన్న చిన్న తప్పులకు ఆయా దేశాల జైళ్లలో మగ్గిపోతున్నారు. అంతేకాక మరికొందరికి చెయ్యని హత్యకు అక్కడ ఉరిశిక్షలు పడుతున్నాయి. ఇప్పటికే అలా ఎందరో జైళ్లలో మగిపోతున్నారు. దుబాయ్ లో ఉంటున్న నిజామాబాద్ కు చెందిన ఓ వ్యక్తికి ఓ హత్య కేసులో ఉరిశిక్ష పడింది. అయితే తాజాగా అతడి కేసు విషయంలో దుబాయ్ ప్రభుత్వం ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. మరి.. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం..
నిజామాబాద్ జిల్లాకు చెందిన శంకర్ అనే వ్యక్తి బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ భవన నిర్మాణ పనులు చేసుకుంటా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అనుకోకుండా ఓ హత్య కేసులో ఇరుక్కపోయాడు. దుబాయ్ ప్రభుత్వం హత్య కేసులో శంకర్ కు ఉరిశిక్ష వేసింది. ఈ నేపథ్యంలో చాలా నెలల పాటు అక్కడి జైల్లో మగ్గిపోయాడు. సాయం చేసే వారు లేక మానసికంగా కుంగిపోయాడు. ఈక్రమంలో దుబాయ్ ప్రభుత్వం హత్య కేసు విషయంలో శంకర్ కు ఊహించన ట్విస్ట్ ఇచ్చింది. క్షమాభిక్ష పెడుతూ అతడి విధించిన ఉరిశిక్షను రద్దు చేసింది. ఉరిశిక్ష రద్దు కావడంతో అతడు చాలా కాలం తరువాత క్షేమంగా స్వదేశానికి చేరుకున్నాడు. ఈక్రమంలో కుటుంబ సభ్యులను కలసిన అనంతరం కన్నీరు పెట్టుకున్నాడు. తన సొంత ఊరికి తిరిగి వచ్చి.. భార్య, పిల్లలను చూస్తాననుకోలేదని కన్నీటి పర్యతమయ్యారు. తాను విడుదలైనందుకు కృషి చేసిన అనురాధ మేడంకి కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ విషయం గురించి శంకర్ పలు విషయాలు పంచుకున్నాడు.
ఆయన మాట్లాడుతూ..” బిల్డింగ్ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ఓ మేస్త్రీ చనిపోయాడు. ఆ సమయంలో నేను అక్కడ లేను. ఆయన చనిపోయిన సమయంలో నేను వేరే ప్రాంతంలో ఉన్నాను. అయినా ఆయన మరణాన్ని నాపై వేశారు. మమల్ని పనిలో పెట్టుకున్న యాజమాని అస్సలు పట్టించుకోలేదు. ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలేదు. నన్ను చాలా నెలల పాటు కస్టడీలో పెట్టారు. ఇక నా భార్య, పిల్లల ముఖాలు చూస్తానని అనుకోలేదు. ఎవరి హత్య కేసులో అయితే నేను జైలు శిక్ష అనుభవిస్తున్నానో.. ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి.. క్షమాపణలు వేడుకున్నాను.
వారి చేత సంతకాలు చేయించాను. వాటిని అక్కడి కోర్టులో సమర్పించడంతో దుబాయ్ ప్రభుత్వం నాపై విధించిన ఉరిశిక్షను రద్దు చేసింది. అయినా దేవుడ దయవల్ల, అనురాధ మేడమ్ కృషితో ఈ రోజు బతికి బయటకు వచ్చాను” అని శంకర్ తెలిపారు. శంకర్ క్షేమంగా తిరిగి ఇంటికి రావడంతో అతడి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఇలా దేశం కానీ దేశంలో చేయని తప్పులకు జైళ్లలో మగ్గిపోతున్న శంకర్ లాంటి అమాయకుల కన్నీటి గాథపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.