రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు, ట్రాఫిక్ పోలీస్ అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారికిపై జరిమానా రూపంలో కొరడ జులిపిస్తున్న సంగతి తెలిసిందే. అయినా కొందరు ట్రాఫిక్ రూల్స్ ను లెక్క చేయడకుండా తమ ఇష్టానురీతిగా రోడ్లపై వాహనాలను నడుపుతున్నారు. అయితే తాజాగా హైదరబాద్ నగర పోలీసులు మాడు పగిలే జరిమానా విధించనున్నారు. నగర పరిధిలోని మూడు నెలల వ్యవధిలో మూడుసార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇస్తున్నారు. ఇలా నిబంధనలు అతిక్రమించిన వారికి 400 శాతం అదనంగా జరిమానా విధిస్తున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఏటా రోడ్డు ప్రమాదల వల్ల 290 మంది మృత్యువాత పడుతున్నారు. ఈ సంఖ్యను భారీగా తగ్గించాలని పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విషయంలో అధికారులు ఎంత కఠినంగా ఉన్నా ట్రాఫిక్ ఉల్లంఘన కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో చలానాల విషయంలో మరింత కఠింనంగా ఉండాలని నిర్ణయించారు. ఈ కొత్త నిర్ణయం తీసుకున్న వెంటనే అమలులోకి తెచ్చారు నగర పోలీసులు. గతంలో హెల్మెట్ లేకపోతే రూ.100 జరిమాన విధించే వారు. అయితే ప్రస్తుతం మూడు నెలల వ్యవధిలో హెల్మెట్ లేకుండా మూడు సార్లు పట్టుపడితే మొదటి సారి రూ.100, రెండో సారి రూ.200 , ఇక మూడో సారి రూ.500 జరిమానా వేస్తున్నారు. కేవలం హెల్మెట్ రూల్ కాకుండా ఇతర ఉల్లంఘనలకు సంబంధించి కూడా ఇదే తరహాలో జరిమానాలు వడ్డిస్తున్నారు.
వారం రోజులుగా కొత్త నిర్ణయాల ప్రకారం దాదాపు 50 వేల మంది వాహనదారులకు చలాన్లు విధించినట్లు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్ అధికారి తెలిపారు. అయితే ఇక్కడ ఓ విషయం గుర్తించుకోవాలి. మొదటి సారి వేసిన చలానాకు సంబంధించి జరిమానా మొత్తం చెల్లిస్తే అలాంటి వారికి మాత్రం కొత్త రూల్స్ లోని జరిమానాను విధించడం లేదు. చలానాను చెల్లించని వారికి మాత్రమే 400 శాతం అధికంగా విధిస్తున్నారు. మరి.. ట్రాఫిక్ అధికారులు తాజాగా తెచ్చిన ఈ కొత్త నిబంధనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.