అందాల పోటీల నిర్వహణపై జనాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఇలాంటి పోటీలను వ్యతిరేకిస్తే.. చాలా మంది మాత్రం.. ప్రోత్సాహిస్తారు. ఇక నేటి కాలంలో.. ఈ తరహా పోటీల్లో పాల్గొనే తెలుగు యువతుల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా హైదరాబాద్ మహిళ మిసెస్ ఇండియా కిరీటం గెలిచింది. ఆ వివరాలు..
ప్రస్తుత కాలంలో అందాల పోటీల్లో పాల్గొనే తెలుగు యువతులు, మహిళల సంఖ్య పెరుగుతోంది. గతంలో అందాల పోటీలు, మోడలింగ్ వంటి వాటిల్లో పాల్గొనాలంటే.. తెలుగు యువతులు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. ఎవరికైనా ఆసక్తి ఉన్నా తల్లిదండ్రులు అంగీకరించేవారు కాదు. అయితే నేడు పరిస్థితులు మారాయి. తెలుగు యువతులు సినిమాలు, సీరియల్స్, మోడలింగ్‌తో పాటు అందాల పోటీల్లో పాల్గొని.. సత్తా చాటుతున్నారు. కేవలం యువతులే కాక.. పెళ్లైన మహిళలు కూడా ఇలాంటి అందాల పోటీల్లో పాల్గొంటూ.. సత్తా చాటుతున్నారు. ఇక తాజాగా మిసెస్ ఇండియా పోటీల్లో.. తెలంగాణ మహిళ సత్తా చాటింది. హైదరాబాద్‌కు చెందిన మహిళ.. మిసెస్ ఇండియా కిరీటం గెలుచుకుంది. ఆ వివరాలు..
మిసెస్ ఇండియా పోటీలు మంగళవారం సాయంత్రం కొచ్చిలోని లీ మెరెడియన్ హోటల్‌లో నిర్వహించారు. ఫైనల్స్‌లో మొత్తం 14 రాష్ట్రాలకు చెందిన వారు పోటీ పడగా.. వారిని వెనక్కు నెట్టి.. తెలంగాణ హైదరాబాద్‌కు చెందిన అంకిత ఠాకూర్ మిసెస్ ఇండియా కిరీటాన్ని చేసుకుంది. కొచ్చిలో మంగళవారం సాయంత్రం జరిగిన ఫైనల్స్‌లో అంకిత విజేతగా నిలిచారు. మిసెస్ ఇండియా గ్లోబల్ పోటీలను పెగాసిస్ వారు కండక్ట్ చేశారు. అంకిత ఠాకూర్ స్వస్థలం హైదరాబాద్. ఆమె సినీ నటి కూడా. తెలంగాణ ఫిలించాంబర్ నుంచి ఆమెకు పూర్తి సహాయసహకారాలు అందించారు.
ఇక అంకిత.. మొదటి ప్రయత్నంలోనే మిసెస్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచి కిరీటంతోపాటు రెండు టైటిల్స్‌ను సైతం గెలుచుకుంది. గతంలో మిసెస్ ఇండియా పోటీలో విజేతగా నిలిచిన రశ్మిక ఠాకూర్ శిక్షణలో అంకిత ఠాకూర్ తెలంగాణ ప్రతినిధిగా అందాల పోటీలో పాల్గొన్నది. మొదటి ప్రయత్నంలోనే సత్తా చాటి.. కిరీటం గెలుచుకుంది. మరి అంకిత ఠాకూర్ సాధించిన విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.