గత కొంత కాలంగా తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. టీఆర్ఎస్ సర్కారు నుంచి, పార్టీ నుంచి అవమానకర రీతిలో ఉద్వాసనకు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఆపై ఉప ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేగా గెలవడం తెలిసిందే. ఈ క్రమంలో ఈటల అవకాశం దొరికినప్పుడల్లా టీఆర్ఎస్ సర్కారును తూర్పారబడుతున్నారు. మహబూబ్ నగర్ లో జరిగిన రైతు సదస్సులో ఈటెల మాట్లాడుతూ.. ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు.
తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారు.. ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అలా సంపాదించిన తెలంగాణ ఇప్పుడు నియంత చేతిలోకి వెళ్లింది. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఎన్నో తప్పులు చేస్తూ వచ్చింది. శిశుపాలుడు వంద తప్పులు చేసినట్లు కేసీఆర్ తాను తప్పులు చేస్తూ, రైతులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఇది కంప్యూటర్ యుగం అయినా, అన్నం పెట్టేది భూమాతేనని స్పష్టం చేశారు. కేసీఆర్ చేస్తున్ తప్పులకు ప్రజలు తప్పకుండా శిక్ష వేస్తారని అన్నారు.
ప్రతిపక్ష హూదాలో ఉన్న తమకు ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని అన్నారు. ప్రజలు నమ్మకంతో అధికార పార్టీకి పట్టం కడితే.. ప్రజల సమ్యలు పరిష్కరించకపోతే కుర్చీపై కూర్చునే అధికారం లేదు అని అన్నారు. అధికార పార్టీ తప్పులు చేస్తూ.. ప్రతిపక్షాలు చూస్తూ ఊరుకోరని ప్రజల సమక్షంలోనే బుద్ది చెబుతారని అన్నారు.