ఈ మద్య కొంత మంది చిన్న చిన్న విషయాలకే డిప్రేషన్ లోకి వెళ్లిపోతున్నారు. ఆ క్షణంలో క్షణికావేశానికి గురై ఎన్నో అనర్థాలకు పాల్పపడుతున్నారు. చనిపోవడం, ఇల్లు వదిలి వెళ్లిపోవడం, ఎదుటి వారిపై దాడులు చేయడం లాంటి చేస్తున్నారు.
ఈ మద్య కాలంలో మనిషి తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతిరోజు సమతుల ఆహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం, యోగా, ధ్యానం, చిన్న చిన్న ఎక్సర్ సైజ్ లు చేస్తూంటాం. అలాగే చాలా మంది వైద్యుల సలహా మేరకు మార్నింగ్ టైంలో వాకింగ్ కు వెళుతుంటారు. మార్నింగ్ వాకింగ్ ఒక గంటన్నర,రెండు గంటలలో ముగించుకుని ఇల్లు చేరుకుంటాం. అయితే బోయిన్ పల్లిలో మార్నింగ్ వాకింగ్ కు వెళ్లిన మహిళ తిరిగి ఇంటికి రాలేదు. అదృశ్యమైన మహిళ కోసం గాలిస్తూ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఓల్డ్ బోయిన్ పల్లి మల్లికార్జున కాలనీ రోడ్ నెం.1 లో సూరజ్ సింగ్, భార్య రేష్మా సింగ్ నివాసముంటున్నారు. మంగళవారం ఉదయం 3 గంటలకు కడుపు నొప్పి వస్తుందని మంచినీళ్లు తాగి ఇంట్లోనే వాకింగ్ చేసింది. కొంతసేపటికి నొప్పి తగ్గకపోవడంతో కుమార్తెకు కడుపు నొప్పి విషయం చెప్పింది. వాకింగ్ కు వెళ్లి వస్తానని ఉదయం 3.20 గంటలకు బయటికి వెళ్లింది. ఉదయం 10 గంటలైనా ఇంటికి తిరిగి రాలేదు. భర్త సూరజ్ సింగ్ భార్య గురించి అడుగగా కూతురు జరిగిన విషయం తండ్రికి చెప్పింది. భర్త చుట్టుపక్కల ప్రాంతాలలో వెతికి, ఆచూకీ దొకకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు కింద నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.