యువతి యువకులు ప్రేమ పేరుతో కుటుంబాల విలువలను కాలరాస్తూ శారీరక సుఖాల కోసం భార్యాభర్తల బంధాన్ని తుడుచేస్తున్నారు. పెళ్లి కన్న ముందుగా ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగి ఆ తర్వాత తల్లిదండ్రుల ఒప్పుకోకపోవటంతో ఫలితంగా పెద్దలు కుదుర్చిన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఆ తర్వాత భర్తతో అనోన్య జీవితాన్ని గడుపుతున్నా..లోపల మనసు మాత్రం ప్రియుడి కోసం ఆరాటపడుతోంది. ఇలాంటి వాటి కోసం భర్యాభర్తల బంధాన్ని నీరు కాలరాస్తూ..పచ్చటి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. ముందుగా ఓ యువతి పెద్దలు కుదర్చిన పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లకు ఓ కూతురు కూడా పుట్టింది. దీంతో ప్రియుడిపై మోజు మాత్రం తగ్గటం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక ఆ వివాహిత భర్తను కాదని ప్రియుడైన శ్రీకాంత్ రెడ్డితో ఈ నెల 22న వెళ్లిపోయింది. రెండు మూడు రోజుల పాటు ఎంజాయ్ చేశారు. కానీ ప్రియుడి ట్విస్ట్‌ల మధ్య వివాహిత తట్టుకోలేక పోయింది. దీంతో శ్రీకాంత్ రెడ్డి మోసం చేస్తున్నాడని గ్రహించి ఆ వివాహిత తట్టుకోలేకపోయింది.
దీంతో ఓ లాడ్జీలో ఆ వివాహిత తన కూతురితో పాటు ఆత్మహత్యకు తెగించి సూసైడ్ చేసుకోబోయింది. దీంతో తన కూతురు ప్రాణాలు కోల్పోగా వివాహిత కోన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఇక ప్రస్తుతం ఆ వివాహిత నిర్మల్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అక్కడ భర్తను కాదని ప్రియుడి మోజులో పడి చివరికి నిండు జీవితాన్ని నాశనం చేసుకుంది ఈ వివాహిత. ఇక వీరిద్దరి మధ్య నలిగి పోయిన ఆ చిన్నారి కూతురు ప్రాణాలు విడవటం విషాదంగా మారింది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.