ప్రస్తుత కాలంలో స్పా, మసాజ్ సెంటర్ల ముసుగులో కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నారు. మరికొంతమంది డ్రగ్స్ అడ్డంగా పెట్టుకొనిఈ స్పా, మసాజ్ సెంటర్లను వాడుకుంటున్నారు.
ప్రస్తుత కాలంలో స్పా, మసాజ్ సెంటర్ల ముసుగులో కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నారు. మరికొంతమంది డ్రగ్స్ అడ్డంగా పెట్టుకొనిఈ స్పా, మసాజ్ సెంటర్లను వాడుకుంటున్నారు. దేశంలోనే ప్రధాన నగరాల్లో యువకులే టార్గెట్ గా చేసుకొని డ్రగ్స్, సె*క్స్ రాకెట్ యదేచ్ఛగా సాగిస్తున్నారు. అలాగే గుట్టుగా తమ దందాను కొనసాగిస్తున్నారు. ఎవరో ఒకరు సమాచారం ఇస్తే పోలీసులు రంగంలోకి దిగి వ్యభిచార దందా నిర్వహిస్తున్న ముఠాని అదుపులోకి తీసుకున్న ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. అయినా గానీ కొంతమంది ఏ మాత్రం భయం లేకుండా దందాను నడుపుతున్నారు.. అయితే ఇప్పుడు ఆ కోవకి చెందిన ఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది.ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
భద్రాచలం పట్టణానికి చెందిన శృతి. ఈమెది మద్యతరగతి కుటుంబం. ఈ యువతికి చిన్నప్పటి నుంచి చదువు అంటే చాలా ఇష్టం. అప్పటి నుంచి చదువుల్లో బాగా రాణించింది. శృతి కి డాక్టర్ కావాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉంది. అలా ఉండడంతో శృతి బాగా చదివి ఉక్రెయిన్ లో ఉచితంగా మెడిసిన్ సీట్ సంపాదించింది. దాంతో కొన్ని రోజులు మెడిసిన్ మెుదటి సంవత్సరం పూర్తి చేసింది. అదే సమయంలోనే రెండో సంవత్సరం వచ్చాక ఆ ఫీజు కట్టలేని పరిస్థితి వచ్చింది. దీంతో ఉక్రెయిన్ నుంచి తిరిగి తన స్వస్థలం భద్రాచలానికి వచ్చేసింది. అలా కొన్ని రోజులు ఊర్లో నే గడిపింది. అంతలోనే ఆ యువతి కి ఏమనిపించిందో తెలియదు కానీ.. హైదరాబాద్ కు వచ్చింది. అదే సమయంలోనే బంజారాహిల్స్ లోని ఓ స్టార్ హోటల్ లో రిసెప్షెనిస్ట్ గానూ పని చేసింది. వస్తున్న శాలరీతో సంతృప్తి చెందక ఈజీగా డబ్బులు సంపాదించడం ఎలా అని ఆలోచించింది.
అయితే ఇందులో బాగంగానే గత ఏడాది నుంచి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మసాజ్ సెంటర్ తెరిచి వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పించి వారితో వ్యబిచారం చేయిస్తూ విపరీతంగా డబ్బు సంపాదించింది. ఇదిలా ఉండగానే కొద్ది రోజుల్లోనే ఆ యువతి బండారం అంతా బయటపడి.. ఆమెను పోలీసులు జైలుకు పంపారు. అలా కొద్ది రోజులు జైలు జీవితాన్ని గడిపి మళ్లీ బయటికి వచ్చింది. దీంతో ఆ యువతి ఆ తప్పుడు పని చేయకుండా ఉండాల్సింది పోయి మళ్లీ అదే దారి పట్టింది. ఇప్పుడు ఈ సారీ బంజారాహిల్స్ లో రోడ్ నెం 10 లోని కార్వీ ఎదురుగా ఓ అపార్ట్ మెంట్ లో పర్పుల్ నేచురల్ హెల్త్ త్రూ ఆయుర్వేదిక్ పేరుతో పెట్టి శృతి, రమణ, జాహెద్ ఉల్-హక్ కలిసి స్పా సెంటర్ ను ఏర్పాటు చేశారు.
ఈ హెల్త్ ఆయుర్వేదిక్ పేరుతో కొన్ని రోజులు స్పా సెంటర్ లో వ్యబిచార పనులను నడిపింది. బయట చూడటానికి ఆయుర్వేదిక్ హెల్త్ అని.. లోపల మాత్రం అశ్లీల వ్యవహారాలు నడుపుతున్నారు. ఇటువంటి వ్యవహారాలు హైదరాబాద్ లో కామన్ అయిపోయింది. ఇంతలోనే చుట్టుపక్కన ఉన్నా స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ యువతి బండారం అంతా బయట పడింది.ఆ స్పా ముసుగులో ఉన్నా మెుత్తం ముగ్గురు నిర్వహకులు, 10మంది యువతులు, 18 మంది విటులు పట్టుబడ్డారు.వీళ్లని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. రెండో సారి ఆమె పట్టుబడంతో తాజాగా సోమవారం జైలుకు తీసుకెళ్లారు.