సాధారణంగా ప్రభుత్వ అధికారి హూదాలో పనిచేసేవారు ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే కార్పోరేట్ హాస్పిటల్స్ కి పరుగులు పెడతారు. ఇదే అధికారులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వసతులు కల్పించబడ్డాయి.. ప్రజలు ఇక్కడ ట్రీట్ మెంట్ తీసుకోవాలని నీతులు వల్లిస్తుంటారు. కానీ కొంతమంది అధికారులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్వయంగా ట్రీట్ మెంట్ తీసుకొని పలువురికి ఆదర్శంగా నిలుస్తుంటారు.
సాధారణంగా ప్రభుత్వ అధికార హోదాలో ఉండేవారు తమ కుటుంబ సభ్యులకు ఏ చిన్న ఇబ్బంది కలిగినా వెంటనే కార్పోరేట్ హాస్పిటల్స్ కి పరెగెత్తుతారు. కానీ అదే అధికారులు సామాన్య ప్రజల వద్దకు వచ్చి ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక వసతులు ఉన్నాయని.. గత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని నీతులు వల్లిస్తుంటారు. కానీ కొంతమంది అధికారులు అలా కాదు.. ప్రత్యక్షంగా ఆ సౌకర్యాలను తామే పరిశీలించి తర్వాత ప్రజలకు చెబుతుంటారు. తాజాగా ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రికి స్వయంగా వెళ్లి అక్కడ ట్రీట్ మెంట్ తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రభుత్వ అధికారులు అంటే ప్రజలపై అధికారం చేలాయించడం మాత్రమే కాదు.. ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వాలు కల్పిస్తున్న సౌకర్యాల పట్ల నమ్మకాన్ని కూడా కలిగించాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలపై అవగాహన కల్పించాలి. అందుకోసం ప్రజలతో మమేకం కావాలి. ఆ కోవకు చెందిన ఓ జిల్లా జాయింట్ కలెక్టర్ ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నారు. ఖమ్మం జిల్లా సబ్ కలెక్టర్ మధుసూదనరావు సాధారణ వ్యక్తిగా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నారు. సాధారణ వ్యక్తులు కూడా ప్రస్తుతం కార్పోరేట్ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న ఈ రోజుల్లో ఓ ఐఏఎస్ హూదాలో ఉండి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు జాయింట్ కలెక్టర్.
గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గా కొనసాగిన అనుదీప్ దురిశెట్టి.. తన భార్యను ప్రసవం కోసం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. కలెక్టర్ అనుదీప్ భార్య మాధవి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఒక కలెక్టర్ హూదాలో ఉండి కూడా కార్పోరేట్ హాస్పిటల్ వైపు పరుగులు పెట్టకుండా సామాన్యుడిలా భద్రాచలం ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యం చేయించిన కలెక్టర్ అందరికీ ఆదర్శంగా నిలిచారు. తెలంగాణలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందుతున్నాయని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఇలాంటి ఆదర్శమైన పనిచేసిన ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ మధుసూదన్ రావుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.